Maharashtra : ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.కోటిన్నర గెలిచిన ఎస్సై .. సస్పెండ్ చేసి షాకిచ్చిన అధికారులు
ఆన్ లైన్ గేమ్ ఆడి కోటిన్నర రూపాయలు సాధించిన ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో భారీగా డబ్బు గెలుచుకున్న ఆ ఎస్సై షాక్ అయ్యారు.

Maharashtra SI Online betting
Maharashtra SI suspend Online betting : ఆన్ లైన్ గేమ్ ఆడి కోటిన్నర రూపాయలు సాధించిన ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి పోలీసు శాఖకు విరుర్ధంగా పనిచేశారంటూ మహారాష్ట్రకు చెందిన ఎస్సై సోమ్‌నాథ్ ను సస్పెండ్ చేశారు. క్రికెట్ బెట్టింగులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటారు. అటువంటివారిని అరెస్టు చేస్తుంటారు. కానీ ఓపోలీసు అధికారే క్రికెట్ బెట్టింగులు చేసి డబ్బులు సంపాదించటంపై మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు శాఖ నిబంధలను విరుద్ధంగా బెట్టింగులకు పాల్పడి డిపార్ట్ మెంట్ పరువు తీశావంటూ సస్పెండ్ చేశారు.
మహారాష్ట్ర పింప్రీ ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో సోమ్‌నాథ్ ఎస్సై గా పనిచేస్తున్నారు. ఆన్ లైన్ గేములు ఆడటమంటే సరదా. ఈక్రమంలో ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల సందర్భంగా సోమనాథ్ ఆన్ లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11లో బెట్టింగ్ తో కోటిన్నర రూపాయలు గెలుచుకున్నారు. సోమనాథ్ డ్యూటీలో ఉండి అక్టోబర్ 10న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్ లో పాల్గొన్నారు.
ఈ జట్ల మధ్య మ్యాచ్‌లో ఓ డ్రీమ్ టీం నిర్మించుకుని కేవలం ఎనిమిది గంట్లోనే రూ.1.5కోట్లు గెలుచుకున్నారు సోమనాథ్. ఈ ఆనందంలో సోమనాథ్ యూనిఫాంలో ఉండే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సోమనాథ్ పై ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేశారు.