పోలీసు స్టేషన్‌లోనే శివాలయం..ప్రతీరోజు పోలీసుల పూజలు

పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ దేవాలయాన్ని కట్టారు. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఎటువంటి దేవాలయాలు ఉండవు. కానీ మధ్యప్రదేశ్‌లోని సంత్ హిర్దారామ్ నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో కొలువైన పరమ శివుడికి పోలీసులు ప్రతి రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
శుక్రవారం (ఫిబ్రవరి 21,2020)శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయానికి పోలీసులు థానేశ్వర్ మహదేవ్ మందిర్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శివపాల్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ గేట్ వద్ద శివాలయం ఉందన్నారు.
ఈ స్టేషన్‌లోని ప్రతి పోలీసు.. శివుడి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. అయితే ఈ ఆలయానికి థానేశ్వర్ మహదేవ్ మందిర్‌గా నామకరణం చేయాలని భక్తులు సూచించడంతో ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కానిస్టేబుల్ యోగేంద్ర రాథోర్ మాట్లాడుతూ.. ప్రతి మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
Bhopal: A temple of Lord Shiva inside the premises of Sant Hirdaram Nagar police station in Bairagarh, has been renamed as ‘Thaneshwar Mahadev Mandir’, on the occasion of #MahaShivaratri. #MadhyaPradesh pic.twitter.com/bkhnGyX3ik
— ANI (@ANI) February 20, 2020