భారీ అగ్ని ప్రమాదం, ఐదుగురు మృతి

భారీ అగ్ని ప్రమాదం, ఐదుగురు మృతి

Updated On : September 3, 2019 / 4:11 AM IST

ఓఎన్జీసీ కోల్డ్ స్టోరేజిలో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం 7గంటలకు జరిగిన ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ఐదుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

యూరన్ ప్లాంట్‌ వద్ద ఉన్న వరద నీటి డ్రైనేజీలో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మేనేజ్‌మెంట్ అప్రమత్తమవడంతో తక్షణ చర్యలకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

50కి పైగా ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయిల్ ప్రొసెసింగ్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, గ్యాస్‌ను హజీరా ప్లాంట్‍‌కు డైవర్ట్ చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.