Tamilnadu Congress: కాంగ్రెస్‌లో చేరండి.. గోల్డ్ గెలుచుకోండి

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ.. జిలా అధ్యక్షులు వింత ఆలోచనతో ముందుకొచ్చారు. జిల్లా ప్రెసిడెంట్ పార్టీలో ఎక్కువమందిని చేర్పించిన వారికి బంగారం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు.

Tamilnadu Congress: కాంగ్రెస్‌లో చేరండి.. గోల్డ్ గెలుచుకోండి

Tamilnadu Congress

Updated On : September 27, 2021 / 7:16 PM IST

Tamilnadu Congress: తమిళనాడు కాంగ్రెస్ పార్టీ.. జిలా అధ్యక్షులు వింత ఆలోచనతో ముందుకొచ్చారు. జిల్లా ప్రెసిడెంట్ పార్టీలో ఎక్కువమందిని చేర్పించిన వారికి బంగారం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు.

సౌత్ చెన్నై సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్ఏ ముథాలకన్ ఆదివారం మీటింగ్ నిర్వహించి ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా సెలబ్రేట్ చేసిన వేడుకకు హాజరై మాట్లాడారు. పార్టీలోకి ఎవరైతే ఎక్కువ మందిని చేరుస్తారో వారికి (8గ్రాములు) కాసు బంగారం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ లిస్టులో తర్వాత నిలిచిన వారికి 4గ్రాములు, 2గ్రాముల బంగారు ఉంగరాలు ఇస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా వీతిధోరమ్ కాంగ్రెస్, వీడుధోరమ్ కాంగ్రెస్ (ప్రతి వీధిలో కాంగ్రెస్, ప్రతి ఇంట్లో కాంగ్రెస్) 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన తర్వాత క్యాడర్ మరింత శ్రమించి 2024ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా అధికారులు ఇటువంటి ఆఫర్లతో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కేఎస్ ఆలగిరీ, ఏఐసీసీ సెక్రటరీ సిరివెల్ల ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

‘అప్పట్లో మీటింగ్ కు వీలైనంత ఎక్కువమందిని తీసుకురావడానికి కష్టపడేవాళ్లం. ఇప్పుడు 500మందిని తీసుకురావాలంటే వాహనాలు ఏర్పాటు చేయనవసరం లేదు, అదనంగా డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఇదంతా ప్రతి డోర్ కు తిరిగి ప్రచారం చేయడం వల్లనే సాధ్యమైంది. మేం సరైన టీం, అజెండా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ఐడియాలజీకి తగ్గట్లుగా వ్యవహరించాలి. ప్రతి వీధిలో ఒక కాంగ్రెస్ సభ్యుడు ఉండాలి. ప్రతి సర్కిల్ లో మెంబర్‌షిప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ మందిని పార్టీలోకి చేర్పించిన వారికి అదే రీతిలో రివార్డులు ఉంటాయని చెప్తున్నాం’ అని ముథాలకన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.