Chief Minister : సీఎం ఇంటిముందు ఆత్మహత్యాయత్నం

రురల్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సీఎం ఇంటిముందు ఆత్మహత్యకు యత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Chief Minister : సీఎం ఇంటిముందు ఆత్మహత్యాయత్నం

Chief Minister

Updated On : September 27, 2021 / 5:27 PM IST

Chief Minister : రురల్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సీఎం ఇంటిముందు ఆత్మహత్యకు యత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటి ముందు జరిగింది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి పేరు వెట్రిమారన్ అని పోలీసులు గుర్తించారు. ఘటనపై ఓ పోలీస్ అధికారు మాట్లాడుతూ.. వెట్రిమారన్ సీఎం నివాసం వద్దకు వచ్చి తనకు న్యాయం చేయాలనీ బిగ్గరగా అరుస్తూ తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను వాటిపై పోసుకొని నిప్పంటిచికున్నట్లు తెలిపారు.

Read More : CM KCR : అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. రెండు రోజుల్లో ఇది రెండోసారి

సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని, మంటలు ఆర్పీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనలో వెట్రిమారన్ శరీరం 40 శాతం మేర కాలినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నాడు. రూర‌ల్ లోక‌ల్ బాడీ ఎన్నిక‌లకు సంబంధించిన ఓ అంశంలో వెట్రిమార‌న్ మ‌న‌స్తాపంతో ఉన్నారు. నామినేష‌న్ల అంశంలో డిప్రెష‌న్‌కు గురైన‌ అత‌ను త‌న విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ చేశాడు.

Read More : CM Jagan : జీతాలు పెంపు.. సీఎం జగన్ శుభవార్త