కొత్త ఫోన్ పట్టుకుపోయాడు.. పాత ఫోన్‌తో దొరికిపోయాడు

కొత్త ఫోన్ పట్టుకుపోయాడు.. పాత ఫోన్‌తో దొరికిపోయాడు

Updated On : December 18, 2019 / 7:40 AM IST

సెల్‌ఫోన్ షాపుల్లో దొంగతనాలు సాధారణమైన విషయమే. కానీ, ఈ ఎలిమెంటరీ దొంగ ఏదో చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. ఫలితంగా ఊచలు లెక్కపెడుతున్నాడు. చెన్నై పక్కనే ఉన్న తొండియార్‌పేట్‌లో ఉన్న సెల్‌ఫోన్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. దొంగ మతిమరుపుతనమే అతణ్ని పట్టించింది. 

జానకిరామన్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఓ సెల్ షాపును నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం 3గంటల సమయంలో షట్టర్ విరగ్గొట్టిన శబ్ధం వినిపించింది. కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాడు. దొంగ ఆనవాళ్లు దొరకలేదు. షెట్టర్ ముందు ఓ కొక్కెం లాంటి రాడ్ ఒకటి దొరికింది. షాపు ఓపెన్ చేసేసరికి ఒక్క మొబైల్ పో్యినట్లు గుర్తించాడు. 

అక్కడే నేలపై ఓ పాత ఫోన్ పడి ఉండటాన్ని గమనించాడు. షాపులో దొంగతనం జరిగిందని, కొత్తగా లాంచ్ అయిన్ మోడల్ ఫోన్ తప్పించి క్యాష్ బాక్స్ తో సహా అన్నీ యథావిధిగా ఉన్నట్లు తెలియజేశాడు. ఆ పాత ఫోన్‌తో పాటు, సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీల్లో వివరాలు సేకరించారు. ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ వివరాలతో దొంగను సులువుగా పట్టేశారు. 

వ్యక్తి దొంగతనం చేసేటప్పుడు షాప్ యజమాని రావడాన్ని గమనించి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో అతను తన పాత ఫోన్ మర్చిపోయి ఉండొచ్చు. ఈ ఫోన్ కూడా దొంగిలించిన వస్తువులా అనిపిస్తుంది. లేదా వేరే వాళ్ల ఫోన్ ఇక్కడ పెట్టి వారిపై అనుమానం వెళ్లేలా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.