Maharashtra: భార్యను భుజంపై మోస్తూ 65ఏళ్ల వయస్సులో 22కి.మీ దూరంలోని హాస్పిటల్‌కు వెళ్లాలని..

చూసిన వారే కాదు తెలిసిన వారు కూడా జాలిపడకుండా ఉండని సంగతి ఇది. 60ఏళ్ల వృద్ధుడు భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు యత్నించి ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో భుజాలపై మోసుకెళ్లే...

Maharashtra: భార్యను భుజంపై మోస్తూ 65ఏళ్ల వయస్సులో 22కి.మీ దూరంలోని హాస్పిటల్‌కు వెళ్లాలని..

Old Man For His Wife

Updated On : September 9, 2021 / 1:27 PM IST

Maharashtra: చూసిన వారే కాదు తెలిసిన వారు కూడా జాలిపడకుండా ఉండని సంగతి ఇది. 60ఏళ్ల వృద్ధుడు భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు యత్నించి ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో భుజాలపై మోసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అలా వెళ్తుండగా భుజంపైనే తుది శ్వాస విడిచింది భాగస్వామి. కొండ ప్రాంతంలో ఇరుక్కుపోయి 22కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కు భార్యను సకాలంలో తీసుకెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మహారాష్ట్రలో బుధవారం ఉదయం చంద్‌సైలీ గ్రామానికి చెందిన సిద్ధాలిబై పడ్వీ అనారోగ్యానికి గురైంది. లోకల్ సబ్ హెల్త్ సెంటర్ మూసి ఉంచడంతో 22కిలోమీటర్ల దూరంలో మాత్రమే రూరల్ హాస్పిటల్ ఉంది. ఆమె భర్త ఆడ్ల్యా పాడ్వీ (65)కి ఎటువంటి ట్రాన్స్ పోర్ట్ దొరకలేదు. అక్కడి నుంచి కాస్త దూరంలో రోడ్ బ్లాక్ అయిపోయి ఉండటంతో రవాణా ఆగిపోయింది.

దాంతో ఆమెను భుజానేసుకుని కొండదారుల్లో హాస్పిటల్ కు బయల్దేరాడు. ఆ కొండ ప్రాంతాన్ని దాటేలోపే తన భుజాలపై ఉన్న భార్య తుది శ్వాస విడిచిందనే సంగతి గమనించాడు. ప్రాణం లేని భార్య ముందు కూర్చొని ఏడుస్తున్న వ్యక్తిని గమనించిన గ్రామస్థుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొద్ది రోజులుగా భార్య కడుపులో నొప్పి అని చెప్తుండటంతో దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడట.

ఘటన జరిగిన తర్వాత జిల్లా అడ్మినిష్ట్రేషన్ అధికారులు, స్థానిక పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం చేరుకున్నారు. బ్లాక్ అయిపోయిన దారిని క్లియర్ చేశారు. మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కురిసిన వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా.. పలు ప్రాంతాలు నీటమునిగాయి.