Kolkata Air port : గుట్కా ప్యాకెట్లలో అక్రమంగా అమెరికా డాలర్లు తరలింపు .. అడ్డంగా బుకైన ప్రయాణీకుడు

గుట్కా ప్యాకెట్లలో అక్రమంగా అమెరికా డాలర్లు తరలిస్తున్న ప్రయాణీకుడిని కష్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Kolkata Air port : గుట్కా ప్యాకెట్లలో అక్రమంగా అమెరికా డాలర్లు తరలింపు .. అడ్డంగా బుకైన ప్రయాణీకుడు

man caught with US currency notes worth Rs 32 lakh hidden inside Gutka pouches

Updated On : January 10, 2023 / 11:12 AM IST

Kolkata Air port : షర్టు బటన్స్ లో, సూట్ కేసు హ్యాండిల్ లో దాచి విమానాల్లో డ్రగ్స్ రవాణా చేయటం చూశాం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో అక్రమంగా అమెరికా డాలర్లు తరలించే ఓ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారుల. గుట్కా ప్యాకెట్లలో అమెరికా కరెన్సీని అక్రమ రవాణా చేస్తున్న ఓ ప్రయాణీకుడుని అరెస్ట్ చేశారు.

అతని నుంచి రూ.32 లక్షల విలువైన 40,000 యూఎస్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం (జనవరి 8,2023) రాత్రి 11.55 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం ఎక్కేందుకు కోల్ కతా చేరుకున్నాడో ఓ ప్రయాణీకుడు.కోల్ కతా నుంచి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళుతున్న ప్రయాణికుడి నుంచి ఈ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

సదరు వ్యక్తి ఇమ్మిగ్రేషన్ చెక్కింగ్ నుంచి కూడా ఏమాత్రం అనుమానం రాకుండ తప్పించుకున్నాడు. ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌ను సమీపిస్తున్న సమయంలో కోల్ కతా కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు బ్యాంకాక్ వెళుతున్న ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతడి లగేజీని తనిఖీ చేసిన అధికారులు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తెరిచి చూడగా, అందులో గుట్కాతో పాటు అమెరికా డాలర్లు కనిపించాయి. డాలర్లను జాగ్రత్తగా ఓ రేపర్ లో చుట్టి ప్యాక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. భారత కరెన్సీలో వాటి విలువ రూ.32 లక్షలు ఉంటుంది. దాంతో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

కాగా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం భారతీయులు విదేశఆలకు వెళ్లే సందర్భంలో గరిష్టంగా రూ.25,000 నగదును INR రూపంలో తీసుకెళ్లవచ్చు. వారు మరో 3000డాలర్లు తీసుకెళ్లొచ్చు. మిగిలిన నగదు మాత్రం కార్డులు, ఫారెక్్స్ కార్డులకు లేదా ట్రావెలర్స్ చెక్కుల రూపంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంత మొత్తంలో నగదు తీసుకెళ్లకూడదు.