సెల్ఫీ దిగుదామని తీసుకెళ్లి.. భర్తను నదిలో తొసేసిన భార్య.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో చూశారా?

నదిలో పడ్డాక అదృష్టవశాత్తూ నీటి ప్రవాహం మధ్య రాయిని పట్టుకున్న తాతప్ప.. తనను కాపాడాలని అరిచాడు.

సెల్ఫీ దిగుదామని తీసుకెళ్లి.. భర్తను నదిలో తొసేసిన భార్య.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో చూశారా?

Updated On : July 12, 2025 / 4:10 PM IST

సెల్ఫీ తీసుకుందామని చెప్పి తన భార్య తనను నదిలోకి తోసేసిందని ఓ వ్యక్తి చెప్పాడు. కర్ణాటక యాదగిరి జిల్లాలోని గుర్జాపూర్ వంతెన వద్ద నదిలో పడ్డ ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు.

ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి వివరాలు తెలిపాడు. సెల్ఫీ తీసుకుంటుండగా తన భార్య తనను కృష్ణా నదిలోకి తోసిందని ఆరోపించాడు. అయితే భార్య మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది.

ఏం జరిగింది?
తాతప్ప అనే వ్యక్తి తన భార్యతో కృష్ణా నది వద్దకు వెళ్లాడు. వంతెనపై బైకు ఆపి, తన భార్యతో ముందుకు నడిచాడు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తాతప్ప నదితో పడిపోయాడు. ఆ తర్వాత తాతప్ప ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడని అతడి భార్య కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. తాతప్ప మాత్రం తన భార్యే తనను తోసేసిందని అంటున్నాడు.

Also Read: భారత్‌లో కొత్త బ్యాంకుల ప్రారంభోత్సవం? కొత్త బ్యాంకులు వచ్చి చాలా రోజులు అవుతుంది కదూ..

నదిలో పడ్డాక అదృష్టవశాత్తూ నీటి ప్రవాహం మధ్య రాయిని పట్టుకున్న తాతప్ప ఆ తర్వాత తనను కాపాడాలని అరిచాడు. అక్కడికి చేరిన స్థానికులు అతడిని బయటకు లాగారు. ఆ సమయంలో, వంతెనపై తాతప్ప భార్య కూడా అక్కడే ఉంది.

తాతప్ప మాట్లాడుతూ.. “నేను బైకుపై వస్తున్న సమయంలో, గుర్జాపూర్ బ్యారేజీ వద్ద ఫొటోలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆమె చెప్పినట్టు నేను నది వైపు నిలబడ్డాను. సెల్ఫీ కోసం నిలబడిన సమయంలో ఆమె ఒక్కసారిగా నన్ను తోసింది. ప్రవాహానికి కొట్టుకుపోతున్న సమయంలో మధ్యలో ఒక రాయిని పట్టుకొని అరవడం ప్రారంభించాను. వంతెనపై వెళ్లిపోయే వారిని సాయం కోరాను” అని అన్నాడు.