Karnataka : ఇద్దరు భార్యల నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి

అతనో వ్యవసాయ కూలి. 40 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకుని విడిపోయాడు. ప్రస్తుతం పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆర్ధికంగా స్థిరపడిన భార్యలిద్దరి నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రస్తుతం ఈ కేసు ఆసక్తికరంగా మారింది.

Karnataka : ఇద్దరు భార్యల నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి

Karnataka

Updated On : June 18, 2023 / 10:41 AM IST

Karnataka : విడిపోయిన ఇద్దరు భార్యల నుంచి భరణం కోరుతూ పిటిషన్ వేసాడు 65 ఏళ్ల వ్యక్తి. వ్యవసాయ కూలీ అయిన అతను పనికి వెళ్లలేకపోవడం.. భార్యలిద్దరూ ఆర్ధికంగా స్థిరపడడంతో వారి నుంచి తనకు మెయింటెనెన్స్ కావాలని కోర్టును ఆశ్రయించాడు.

Maharashtra : 78 ఏళ్ల భార్య వేధింపులపై కోర్టుకెక్కిన 83 ఏళ్ల వ్యక్తి..భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పు
కర్నాటక యాదగిరి జిల్లాలోని భీమరాయణగుడికి చెందిన ధారూ రాథోడ్ వ్యవసాయ కార్మికుడు. 40 సంవత్సరాల క్రితం టిప్పిబాయి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల తరువాత కమలీబాయి అనే మరో స్త్రీని కూడా వివాహమాడాడు. ఇద్దరి నుంచి విడిపోయాడు. ఆ తరువాత అతని భార్యలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడి పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేశారు. ప్రస్తుతం రాథోడ్‌కు 65 ఏళ్లు వచ్చాయి. వయసు మీద పడటంతో వ్యవసాయ పనులకు వెళ్లడం మానేశాడు. దాంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది.

ఈ క్రమంలో అతను భార్యల ఆర్ధిక పరిస్థితిని RTI ద్వారా ఎంక్వైరీ చేశాడు. మొదటి భార్య 55 సంవత్సరాల టిప్పిబాయి రూ.38,636 , రెండవ భార్య 50 సంవత్సరాల కమలిబాయి రూ.36,896  జీతాలు డ్రా చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. వీటి ఆధారంగా చేసుకుని రాథోడ్ వీరిద్దరి నుంచి నెలవారి భరణంగా చెరో రూ.10,000 అంటే నెలకు రూ.20,000 ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు.

Pune Court : రివర్స్ .. భార్యే భర్తకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు..!

ప్రస్తుతం ఇతని కేసును కోర్టు విచారిస్తోంది. ఇటీవల కాలంలో మారిన చట్టాలు రాథోడ్‌కు ఏ మాత్రం మేలు చేస్తాయో చూడాలి.