Viral Video: అమ్మాయిల కంటే బాగా బెల్లీ డ్యాన్స్ చేసి యువతుల మతిపోగొట్టిన యువకుడు
అమ్మాయిల కన్నా అబ్బాయిలే బాగా బెల్లీ డ్యాన్స్ చేయగలరని నిరూపించాడు. నోరా ఫతేహి కూడా ఈ అబ్బాయి ముందు చిన్నబోతుందని..

Viral Video
Viral Video: బెల్లీ డ్యాన్స్ అనగానే గుర్తుకు వచ్చేది నోరా ఫతేహిలాంటి అమ్మాయిలు. కెనడా డ్యాన్సర్ నోరా ఫతేహి బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే కనురెప్పలు కొట్టకుండా చూస్తుండి పోతారు కుర్రాళ్లు. అయితే, బెల్లీ డ్యాన్స్ అంటే అమ్మాయిలే చేయాలా ఏంటి? అంటూ ఓ యువకుడు ఆ డ్యాన్సును నేర్చుకుని మరీ చేశాడు.
అతడి బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ పార్టీలో ఆ యువకుడు బెల్లీ డ్యాన్స్ చేసి అక్కడున్న వారి మతిపోగొట్టాడు. అమ్మాయిల కన్నా అబ్బాయిలే బాగా బెల్లీ డ్యాన్స్ చేయగలరని నిరూపించాడు. నోరా ఫతేహి కూడా ఈ అబ్బాయి ముందు చిన్నబోతుందని నెటిజన్లు అంటున్నారు.
ఆ యువకుడు బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే పార్టీలో ఉన్నవారంతా విజిల్స్ వేస్తూ, కేరింతలు కొడుతూ, చప్పట్లతో హోరెత్తించారు. 42 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో డ్యాన్స్ చేసి ఈ యువకుడు ఎవరన్న వివరాలు బయటకు రాలేదు. అమ్మాయిలు బెల్లీ డ్యాన్స్ చేయాలనుకుంటే ఈ యువకుడి వద్దకు వచ్చి నేర్చుకుని చేయాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Nora Fatehi who? pic.twitter.com/8uH7VPQ78H
— desi mojito ?? (@desimojito) October 16, 2023
Pepper X : ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చికి గిన్నిస్ రికార్డ్