పులి చేతికి చిక్కినట్టే చిక్కి.. ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి

మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే… ఓ ఊర్లో్కి చోరబడిన పులిని గ్రామస్తులంతా తరుముతున్నారు. దాంతో పులి ప్రక్కనే ఉన్న పోలంలోకి పరుగులు తీసింది. హఠాత్తుగా ఓ వ్యక్తి పై దాడికి ప్రయత్నించింది. ఆ వ్యక్తి పరుగులు పెడుతూ కింద పడిపోయాడు.
ఆ వ్యక్తి చచ్చానారో అంటూ భయపడుతూ, ధైర్యం ఏమాత్రం కోల్పోకుండా ఊపిరి బిగపట్టి, చనిపోయినట్లు పడుకున్నాడు. ఆ వ్యక్తి గుండెను నోటితో చీల్చి, తినాలని అనుకుంది పులి. అంతలో గ్రామస్తుల అరుస్తూ,రాళ్లు విసిరేయడంతో పులి భయపడి పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల మాత్రం ‘చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
You want to see how does a narrow escape looks like in case of encounter with a #tiger. #Tiger was cornered by the crowd. But fortunately end was fine for both man and tiger. Sent by a senior. pic.twitter.com/1rLZyZJs3i
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 25, 2020