Viral video : రావిచెట్టుకు కాసిన మామిడి కాయలు..! ఫేక్ న్యూస్

Mango Fru (2)
Mango fruit on a peepal tree : ఉత్తరాఖండ్ లోని రుషికేశ్‌లో ఓ రావి చెట్టుకు మామిడికాయలు కాశాయని వార్తను పబ్లిష్ చేశాం. ఆ వింతనుచూడటానికి జనాలు భారీగా తరలివచ్చారన్న ఫేక్ కథనాల ఆధారంగా మేం వార్తను పబ్లిష్ చేసినందుకు చింతిస్తున్నాం. రుషికేశ్‌లో పలు పుణ్య క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలా రుషికేశ్‌కు వెళ్లిన కొంతమంది భక్తులకు రావి చెట్టుకు వేలాడుతున్న మామిడిపండ్లు కనిపించాయని, సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ అయింది. ఇదంతా ఫేక్ న్యూస్.