Manik Rao Thackeray : బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు : మాణిక్ రావు థాక్రే

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

Manik Rao Thackeray : బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు : మాణిక్ రావు థాక్రే

Manik Rao Thackeray

Manik Rao Thackeray Criticize : తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్.. బీజేపీ బీ టీమ్ మాత్రమేనని ఆరోపించారు.

సోమవారం మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు, పొంగులేటి, జూపల్లి సమావేశం కానున్నారు. ఈ మేరకు మాణిక్ రావు థాక్రే, పిసిసి రేవంత్ రెడ్డి, టి కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ మీడియా హాల్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాణిక్ రావు థాక్రే మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు.

Mallu Ravi : జేపీ నడ్డా ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.. బండి సంజయ్ చేయబోమన్నారు : మల్లు రవి

బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లో చేరేవారి వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. పసలేనివారే బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై తనకు సమాచారం లేదన్నారు. అది అధిష్టానం పరిధిలోని అంశమని తెలిపారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నారో లేదో తనకు తెలియదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. పార్టీలో చేరుతున్న వారికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదన్నారు. సర్వేలో గెలుపు ప్రాతిపదికనే పార్టీలో ఎవరికైనా టికెట్లు ఇస్తారని తెలిపారు.