అశ్రునయనాలతో : సాయంత్రం పారికర్ అంత్యక్రియలు

  • Published By: chvmurthy ,Published On : March 18, 2019 / 07:35 AM IST
అశ్రునయనాలతో : సాయంత్రం పారికర్ అంత్యక్రియలు

గోవా: అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి  మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం  కంఫాల్ లోని ఎన్ఏజీ గ్రౌండ్స్ లో జరుగుతాయి. ఆయన పార్ధివదేహాన్ని ఉదయం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకురాగా… పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని కళా అకాడమీకి తీసుకుని వెళ్ళారు. సాయంత్రం 4 గంటల వరకు కళా అకాడమీలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచుతారు.  సాయంత్రం 5 గంటలకు అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.  
Read Also : గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

పారికర్ మృతికి సంతాప సూచకంగా  ఇవాళ జాతీయ సంతాప దినాన్ని కేంద్రం  పాటిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను సగం వరకు అవనతం  చేశారు.  గోవాకు 3 సార్లు సీఎం గా పని చేసిన మనోహర్ పారికర్  గతేడాది మార్చిలో  క్లోమగ్రంధి కేన్సర్ బారిన పడి చికిత్స పొందుతూ  ఆదివారం మార్చి 17, 2019న  తుది శ్వాస విడిచారు. 
Read Also : గోవా సీఎం పారికర్ కన్నుమూత