Maoist RK : ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ-ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.

Maoist
Maoist RK Last Rites : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ-ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పామేడు – కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో అంత్యక్రియలు జరిగినట్లు వెల్లడించింది. 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు చేయడం జరిగిందని, ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీగా హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో సమీప గ్రామవాసులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.
Read More : Quran app banned in china : చైనాలో ముస్లింలకు ఖురాన్ యాప్ తొలగించిన యాపిల్..
ఆర్కే అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ అడవీ ప్రాంతంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఆయన చనిపోయారని అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన ప్రకటనలో వెల్లడించారు. మావోయిస్టుల అది నాయకత్వంలో అగ్రగణ్యుడయిన ఆర్కే గెరిల్లా ఆర్మీ నిర్మాణంలో, శత్రువులపై దాడి చేయడంలో మాస్టర్ మైండ్‌గా పేరు ఉంది. ఆర్కేపై చాలా కేసులున్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు.
Read More : Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..
2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆర్కే మావోయిస్టుల పక్షాన నాయకత్వం వహించారు. ఆర్కే ఏవోబీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఒడిశాలోని మల్కంగిరి, బలిమెల దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన కుమారుడు మున్నా మరణించారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తిచేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.