Quran app banned in china : చైనాలో ముస్లింలకు ఖురాన్ యాప్ తొలగించిన యాపిల్..

చైనాలో ముస్లింలకు యాపిల్ కంపెనీ ఖురాన్ యాప్ తొలగించింది. చైనా అధికారుల సూచనల మేరకు ఖురాన్ యాప్ ను తొలగించామని యాపిల్ ప్రకటించింది.

Quran app banned in china : చైనాలో ముస్లింలకు ఖురాన్ యాప్ తొలగించిన యాపిల్..

Quran App Banned In China

Quran app banned in China: చైనాలో ముస్లింలపై ఆంక్షలు, వేధింపులు కొనసాగుతున్నాయా? అంటే నిజమేననే ఘటనలో జరుగుతున్నాయి. ముస్లింలు అంటే చైనాకు అంత కక్ష ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి మైనార్టీ సామాజిక వర్గంపై పెరుగుతున్న ఆంక్షలు, వేధింపులు చూస్తుంటే..వాట్సాప్, జీ మెయిల్స్ వినియోగించే మహిళలపై క్రిమినల్ కేసులు పెట్టటం..అలాగే ముస్లిం మహిళలకు బలవంతంగా కుటుంబ నీయంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ముస్లింల విషయంలో మరో కొత్త ఆంక్షలు పెట్టిందా అన్నట్లుగా చైనాలో ఉండే ముస్లింలకు ‘యాపిల్ కంపెనీ’ షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖురాన్ యాప్‌ను చైనాలో తొలగించింది. చైనా అధికారుల అభ్యర్ధన మేరకు ఖురాన్ యాప్ ను తొలగించినట్టు యాపిల్ ప్రకటించింది. దీంతో చైనాలో నివసిస్తున్న ముస్లింలు అవాక్కయ్యారు.

కాగా..ఇస్లాం మతాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా గుర్తించింది. అయినా చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముఖ్యంగా చైనాలోని జింజయాంగ్ రీజియన్​లోని ముస్లిం ఉయ్‌ఘుర్ జాతిపై ప్రభుత్వం మారణ హోమానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని వాస్తవాలేనని ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని కథనాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖురాన్ యాప్‌ను చైనాలో తొలగించిన యాపిల్..చైనా అధికారుల అభ్యర్ధన మేరకే ఖురాన్ యాప్ ను తొలగించినట్టు ప్రకటించటం ముస్లింల విషయంలో చైనా అవలంభించే తీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

Read more : China : చైనాలో వాట్సాప్‌, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలు అరెస్ట్‌

ఖురాన్ మజీద్ యాప్ ప్రపంచంలో అన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా ముస్లింలు ఈ యాప్ వాడుతున్నారు. దీనికి దాదాపుగా 1,50,000 రివ్యూలు కూడా వచ్చాయి. అయితే, చట్ట విరుద్దమైన మతాలకు సంబంధించిన కంటెంట్ ప్రచారం చేయడం వల్లే ఈ యాప్​ను తొలగిస్తున్నట్లు యాపిల్​ సంస్థ స్పష్టం చేసింది. ఈ యాప్ తొలగించినట్టు ముందుగా యాపిల్ తన సెన్సార్ షిప్ ద్వారా వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సెన్సార్ షిప్ వెబ్ సైట్.. యాపిల్ స్టోర్ యాప్‌లను పర్యవేక్షిస్తుంది. ఈ యాప్ లో ఉన్న కంటెంటు ప్రకారం..చైనా అధికారుల నుంచి కొన్ని అదనపు పత్రాలు తమకు అందాల్సి ఉందని, అవి అందించకపోవడంతోనే ఖురాన్ మజీద్ యాప్​ను తొలగించామని యాప్​ క్రియేటర్ పీడీఎంఎస్ సంస్థ వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా సైబర్ స్పేస్ పాలనా సంస్థతో పాటు, సంబంధిత చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని సదరు సంస్థ తెలిపింది.ఈ యాప్​కు ఒక్క చైనాదేశంలోనే పది లక్షల మంది యూజర్లు ఉన్నాయని పీడీఎంఎస్ తెలిపింది.

ఇస్లాం మతాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా గుర్తించింది. అయినా చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముఖ్యంగా చైనాలోని జింజయాంగ్ రీజియన్​లోని ముస్లిం ఉయ్‌ఘుర్ జాతిపై ప్రభుత్వం మారణ హోమానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా చైనా అనేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానేచైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ సంస్థ ఖురాన్ యాప్​ను తొలగించాలని నిర్ణయించటం తొలగించటం కూడా చేసింది.కాగా..యాపిల్ యొక్క అతి పెద్ద మార్కెట్ లో చైనా ఒకటి కావటంతో చైనా చెప్పటంతో యాపిల్ సంస్థ అక్కడ ఉండే ముస్లింల ఖురాన్ యాప్ ను తొలగించినట్లుగా తెలుస్తోంది.

Read more : చైనాలో ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..అబార్షన్లు

కాగా,ప్రస్తుతం యాపిల్సెన్సార్ షిప్ బ్యూరో ఆఫ్ బీజింగ్ గా మారబోతోందని యాపిల్ సెన్సార్ షిప్ ప్రాజెక్టు డైరెక్టర్ బెంజిమిన్ ఇస్మాయిల్ చెప్పారు. సెన్సార్​షిప్​లో అనేక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని.అయితే, దీని ప్రతిస్పందన కూడా చైనా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని బెంజమన్ ఇస్మాయిల్ గుర్తు చేశారు.ఖురాన్ యాప్ తో పాటు, ప్రఖ్యాత బైబిల్ యాప్ ఆలివ్ ట్రీస్యాప్​నుకూడా ఈ వారం తొలగించామని పీడీఎంఎస్ సంస్థ బీబీసీకి తెలిపింది.

కాగా..జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ రూపొందించిన వ్యూహాత్మక ఓటింగ్ యాప్‌ను ఆపిల్ , గూగుల్ తొలగించాయి. ఈ రెండూ యాప్ డ్రాప్ చేయడానికి నిరాకరిస్తే ఆ రెండు కంపెనీలకు జరిమానా విధిస్తామని రష్యా అధికారులు సదరుకంపెనీలను బెదిరించటంతో అలెక్సీ నవాల్ని ఓటింగ్ యాప్ ను తొలగించాయి. ఇలా ఆయా దేశాల్లో ఉండే మార్కెంటింగ్ విధానాలు..వివిధ కారణాలతో ఆయా కంపెనీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయనే విషయం మరోసారి నిరూపితమైంది.