గడ్చిరోలిలో: పోలింగ్ బూత్‌ వద్ద మందుపాతర పేల్చిన మావోలు

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 09:18 AM IST
గడ్చిరోలిలో: పోలింగ్ బూత్‌ వద్ద మందుపాతర పేల్చిన మావోలు

Updated On : April 11, 2019 / 9:18 AM IST

గడ్చిరోలి : దేశ వ్యాప్తంగా తొలి విడత లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ను అడ్డుకునేందుకు నక్సల్స్ యత్నిస్తున్నారు. ఓటింగ్ లో పాల్గొనవద్దంటు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. 

కాగా మందుపాతర పేలిన సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. కానీ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని..ఎవ్వరు భయపడవద్దనీ..అందరూ ఓటుహక్కుని వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు. కాగా గడ్చిరోలి జిల్లాలో గత రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఓ సీఆర్‌పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఏప్రిల్ 4న  దంతేవాడలో మందుపాతర పేల్చిన ఘటనలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, ఆయన ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
  

ఈ క్రమంలో నక్సల్స్ ప్రాంతమంటే ముందుగా గుర్తుకొచ్చే ప్రాంతమైన చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఎన్నికలు కొనసాగుతుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. బస్తర్ నియోజకవర్గంలో భద్రతా దళాలు ఎన్నికల సిబ్బందిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని..అందరు సురక్షితంగా ఉన్నారనీ ఓ పోలీస్ అధికారి తెలిపారు.