సినిమా రేంజ్‌లో 3 కార్లతో మరో కారుని చేజ్‌ చేసి.. బంగారం దోపిడీ.. వీడియో చూస్తారా?

వాహనాల్లో వచ్చిన ముఠా జాతీయ రహదారిపై కుతిరన్ సమీపంలో ఈ దోపిడి చేస్తుండగా, ఆ రోడ్డులోనే వెళ్తున్న వారు అంతా..

సినిమా రేంజ్‌లో 3 కార్లతో మరో కారుని చేజ్‌ చేసి.. బంగారం దోపిడీ.. వీడియో చూస్తారా?

Updated On : September 27, 2024 / 5:30 PM IST

Heist in Thrissur: సినిమాల్లో రౌడీలు పట్టపగలే నడిరోడ్డుపై చోరీలు చేస్తుంటారు. అందుకోసం చేజింగ్‌లు, భారీగా వేగంతో కార్లలో దూసుకుపోవడాలు వంటి సాహసాలు చేస్తుంటారు. అచ్చం సినిమాల్లోలాగే పట్టపగలు పడిరోడ్డుపై కేరళలోని త్రిస్సూర్‌లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది.

బంగారం వ్యాపారి, అతని సహచరుడు పసిడిని కారులో తీసుకెళ్తుండగా ఆ వాహనాన్ని ఛేజ్‌ చేసి, మూడు కార్లతో అడ్డగించి మరీ కొందరు 2.5 కిలోల బంగారాన్ని అపహరించారు. కోయంబత్తూరు నుంచి త్రిసూర్‌కు వ్యాపారి బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వాహనాల్లో వచ్చిన ముఠా జాతీయ రహదారిపై కుతిరన్ సమీపంలో ఈ దోపిడి చేస్తుండగా, ఆ రోడ్డులోనే వెళ్తున్న వారు అంతా చూస్తూనే ఉన్నారు తప్ప ఆ ముఠా సభ్యులను కనీసం ప్రశ్నించలేదు. అక్కడి సీసీటీవీల ద్వారా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు బయటపడ్డాయి.

కోయంబత్తూరులో తయారు చేసిన బంగారాన్ని తీసుకెళ్తున్న స్విఫ్ట్ డిజైర్‌ను ముఠా సభ్యులు ముసుగులు ధరించి వచ్చి దోపిడీ చేసినట్లు అందులో కనపడుతోంది. కారు అడ్డగించిన దుండగులు బంగారు వ్యాపారి అరుణ్ సన్నీ, అతని సహచరుడు రోజీ థామస్‌లను కత్తులు, గొడ్డళ్లతో బెదిరించి సుత్తితో దాడి చేశారు.

బాధితులను బలవంతంగా కారులో నుంచి దించేశారు. ఆ తర్వాత బంగారం, వాహనం రెండింటినీ తీసుకుని ముఠా సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. అరుణ్ సన్నీ, అతని సహచరుడు రోజీ థామస్‌లను కూడా అదే వాహనంలో తీసుకెళ్లి.. అరుణ్ సన్నీని పుత్తూరులో, రోజీ థామస్‌ను పాలియెక్కరలో వదిలేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో స్వామీజీల సమావేశం.. ఏమన్నారంటే?