కదం తొక్కిన ఆశా వర్కర్లు..గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ

ఆశా వర్కర్లు కదం తొక్కారు. గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. శేషాది రోడ్ ఫ్లై ఓవర్ నుంచి వెళుతున్న ఈ ర్యాలీ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి మోడీ వచ్చిన రోజునే ఆశా కార్యకర్తలు ఈ భారీ ర్యాలీ నిర్వహించారు.
కనీస వేతనం రూ. 12 వేలు చెల్లించాలి..ఆరోగ్య బీమా వర్తింప చేయాలని, 15 నెలల నుంచి పేరుకపోయిన..ప్రోత్సాహ ధనం విడుదల చేయాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోయేసరికి..భారీ ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. 2020, జనవరి 03వ తేదీ శుక్రవారం సిటీ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ ప్రారంభించారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
పింక్ కలర్ ధరించిన మహిళలు..శేషాద్రి రోడ్ ఫ్లై ఓవర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. AITUC ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. వీరందరూ ప్రీడం పార్కుకు చేరుకొనే సరికి ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాష్ట్రంలో 41 వేల మంది ఆశా వర్కర్లు ఉన్నారని, తమ డిమాండ్లు నెరవేర్చాలని కర్నాటక స్టేట్ సంయుక్త ఆశా వర్కర్ సెక్రటరీ డి.నాగలక్ష్మి డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణకు సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్న దృష్ట్యా వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరడం జరిగిందన్నారు.
తిరిగి వెళ్లడం జరుగుతోందని..అయితే..తాము ఆందోళన మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖాధికారులతో సమావేశాలు జరిపినా..వారి నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. గత 15 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు వేతనం రూ. 4 వేలు మాత్రమే ఇస్తోందని, తమకు జీతాలు పెంచి..బకాయిలు విడుదల చేయాలని బళ్లారికి చెందిన ఆశా వర్కర్ డిమాండ్ చేశారు.
దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పంకజ్ కుమార్ పాండే స్పందించారు. విధులు కొనసాగించాలని ఆశా వర్కర్లను కోరడం జరిగిందన్నారు. వారి కోరుతున్న డిమాండ్లలో అధిక భాగం తీర్చామని, ఇతర డిమాండ్లపై ఉన్నతాధికారులతో మాట్లాడాల్సి ఉంటుందన్ోనారు. అప్పటి వరకు ఆశా వర్కర్లు పనిలో చేరాలని సూచించారు.
Read More : స్వచ్ఛమైన గాలి కోసం : ఢిల్లీలో స్మాగ్ టవర్..విశేషాలు