పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపైకి బద్ధశత్రవులు : మాయావతి, ములాయం ఎన్నికల ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పాతికేళ్ల తర్వాత బద్ధశత్రవులు ఒకే వేదికపైకి వచ్చారు. బీజేపీని ఓడించమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. మెయిర్ పురిలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. వీరితో పాటు అఖిలేష్ యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఒకే వేదికపై నుంచి మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ములాయ్ సింగ్..మాయావతికి స్వాగతం పలికారు.
1995లో ఎస్పీ, బీఎస్పీ కూటమి విడిపోయింది. స్టేజ్ గెస్ట్ హాజ్ లో తన మద్దతుదారులతో సమావేశమైన బీఎస్పీ అధినేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. అప్పుడు విడియపోయిన ఇద్దరు మళ్లీ లోక్ సభ ఎన్నికలు 2019కు ఒక్కట్టయ్యారు. యూపీలో బీజేపీని ఓడించేందుకు ఏకమయ్యారు.