Mayawati: కోటాలో కోటా ఉండాల్సిందే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారీ డిమాండ్ చేసిన మాయావతి

మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు సాగడాన్ని కులవాద పార్టీలు సహించలేవని బీఎస్పీ అధినేత మాయావతి నిప్పలు చెరిగారు. బిల్లు ఆమోదానికి పూర్తి సహకారం అందిస్తామని, సీట్లు పెంపకం అనంతరం ఎలాంటి రాజకీయాలు చేయకూడదని మాయావతి సూచించారు.

Mayawati: కోటాలో కోటా ఉండాల్సిందే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారీ డిమాండ్ చేసిన మాయావతి

Women Reservation Bill: నూతన పార్లమెంట్ భవనం, మహిళా రిజర్వేషన్ బిల్లుపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి పెద్ద ప్రకటన చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి ఆమె స్వాగతం పలికారు. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ మద్దతు పలికారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ బిల్లు ఈసారి ఆమోదం పొందుతుందని మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ బిల్లుపై ఆమె భారీ డిమాండే లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు.

అంటే, మహిళా రిజర్వేషన్‌ కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కోటా కేటాయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశంలో ఉన్న కులాల వర్గీకరణ ఆధారంగా వెనుకబాటుకు గురైన వారిలో అన్ని వర్గాల మహిళలు ఉన్నారని, వెనుకబడిన సామాజిక వర్గాల మహిళలు మరింత వెనుకబడిపోయి ఉన్నారని, వారికి చేయూతనివ్వడం నైతిక బాధ్యతని మాయావతి అన్నారు.

Sonia Gandhi : ఈ బిల్లు మాది, మా కల : మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు సాగడాన్ని కులవాద పార్టీలు సహించలేవని బీఎస్పీ అధినేత మాయావతి నిప్పలు చెరిగారు. బహుజన వర్గాల (ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనారిటీ) మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాట్లు చేయాలని, అలా జరగకపోతే కాంగ్రెస్ లాగే భారతీయ జనతా పార్టీని కూడా చూస్తారని ఆమె అన్నారు. బిల్లు ఆమోదానికి పూర్తి సహకారం అందిస్తామని, సీట్లు పెంపకం అనంతరం ఎలాంటి రాజకీయాలు చేయకూడదని మాయావతి సూచించారు.

ఇక మాయావతి వ్యాఖ్యలకు అనుగుణంగా చాలా మంది నుంచి ఈ డిమాండ్ వస్తోంది. ఇప్పటికే రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‭వాదీ లాంటి పార్టీలు ఈ డిమాండ్ ను లేవనెత్తాయి. ఇక మరోపక్క దేశ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ వినిపిస్తోంది. నెట్టింట్లో దీనిపై పెద్ద క్యాంపెయిన్ సాగుతోంది. ‘#Quota_Within_Quota’ అనే హ్యాష్ ట్యాప్ ప్రస్తుతం ఎక్స్(ట్విటర్)లో ట్రెండింగులో ఉంది.