Medical Miracle : 30ఏళ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ

దేశ రాజధాని ఢిల్లీ ఆస్పత్రిలో మిరాకిల్ చోటుచేసుకుంది. సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ మహిళ 30ఏళ్ల తర్వాత నోరు తెరిచింది. పుట్టుకతోనే మహిళకు నోరు పూడుకుపోయింది.

Medical Miracle : 30ఏళ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ

Medical Miracle In Delhi Hospital (1)

Updated On : March 31, 2021 / 1:09 PM IST

Medical miracle in Delhi hospital : దేశ రాజధాని ఢిల్లీ ఆస్పత్రిలో మిరాకిల్ చోటుచేసుకుంది. సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ మహిళ 30ఏళ్ల తర్వాత నోరు తెరిచింది. పుట్టుకతోనే మహిళకు నోరు పూడుకుపోయింది. ఢిల్లీ ఆస్పత్రిలోని వైద్యులు ఆమెకు సర్జరీ చేసి నోరు తెరిచేలా చేశారు. ఇది వైద్య చరిత్రలోనే అద్భుతంగా చెబుతున్నారు. తనకు పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని మహిళ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఢిల్లీకి చెందిన మహిళ ఆస్తా మోంగియా.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పుట్టుకతో వచ్చే రుగ్మత కారణంగా నోరు తెరవలేని పరిస్థితి. కొన్ని  నెల రోజుల క్రితం సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరింది. గత 30 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతోంది. ఆమె దవడ ఎముక నోరు రెండు వైపుల నుంచి ముందుకు వెళ్లి.. పుర్రె ఎముకతో అతుక్కుపోయాయి. దాంతో చిన్నప్పటి నుంచి నోరు తెరవలేదు. కేవలం ద్రవ పదార్థాలతో మాత్రమే ఆహారం తీసుకుంటోంది. అప్పటినుంచి ఆమె నోటిలోని దంతాలన్నీ క్రమంగా క్షీణిస్తు వచ్చాయి.

గతంలో ఇండియాతో పాటు దుబాయ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరగా ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జరీ విభాగం సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజీవ్ అహుజా సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారు. సర్జరీకి మూడు వారాల ముందు ప్రారంభమయ్యాయి. రక్తంతో నిండిన సిరలను కొద్దిగా కుదించడానికి రోగి ముఖానికి ప్రత్యేక ఇంజెక్షన్ వేశారు. 2021 మార్చి 20న జరిగిన ఆపరేషన్‌ దాదాపు 3 గంటల 50 నిమిషాలపాటు కొనసాగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది.. ఆస్తా నోరును 2.5 సెంటీమీటర్ల మేర తెరుచుకునేలా చేశారు వైద్యులు. శస్త్రచికిత్స తర్వాత ఐదు రోజులకు ఆస్తాను డిశ్చార్జ్ చేశారు. ఫిజియోథెరపీ ద్వారా 3 సెంటీమీటర్ల మేర నోరు తెరవ గలుగుతుందని చెప్పారు.