వధువు కమలాశ్రీపాద వరుడి ‘వెనుక’ కాదు ’పక్కనే’ నడిచింది

‘‘ఆధునిక యువత చరిత్రను తిరగరాస్తుంద’’ని ఓ మహానుభావుడు అన్నాడు. ఆ మాటల్ని అక్షరాలా నిజం చేస్తోంది నేటి యువత. స్త్రీ పురుష వివక్షలకు పాతరేస్తు కొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు.అటువంటి ఓ ఆధునిక జంట ఆదర్శ ఆలోచనలతో చేసుకున్న పెళ్లి విశేషంగా నిలిచింది. వధూవరులిద్దరు అభిరుచులతో పాటు ఆలోచనలను పంచుకున్నారు. పెళ్లిలో ఆడపిల్ల ఇలా ఉండాలి..ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఇటువంటి మర్యాదల్ని చేయాలి..పెళ్ళి కొడుకు కాళ్లు కడిగి ఆడపిల్లలను దానం (కన్యా దానం) ఎందుకు చేయాలి అనే పద్ధతులకు స్వస్తి చెప్పారు. అంతేకాదు వరుడు వెనకాల వధువు నడవాలి అనే అతి ముఖ్యమైన పద్ధతికి కూడా స్వస్తి చెప్పి వరుడు పక్కనే వధువు నడిచింది. భార్య నడవాల్సింది భర్త వెనకాల కాదు..భర్త పక్కనే అంటూ ‘కలిసి నడుద్దాం’అంటూ సరికొత్త సంకేతాలనిచ్చారు ఈ ‘‘ఆధునిక జంట’’. ‘‘అన్నింటా సమానత్వం’’అంటూ సాటి చెప్పారు.
వివరాల్లోకి వెళితే..అది అతి విశాలమైన గోవా రిసార్ట్. అక్కడో పెళ్లి జరుగుతోంది. వధువు కమలా శ్రీపాద. వరుడు యాగ్నిక్. వీరిద్దరూ తమ పెళ్లి ఎలా జరగాలో ముందే అంతా ప్లాన్ చేసుకున్నారు. పంజాబీ సంప్రదాయాలల్లో నాలుగు పద్దతులను వీరు తమ పెళ్లినుంచి నిషేధించారు. దీంట్లో భాగంగా తమ పెళ్లిలో ‘‘కన్యాదానం’’ ఉండకూడదనుకున్నారు. ఆడపిల్లను కన్నవాళ్లు ‘‘కన్య’’ను దానం ఇవ్వటమేంటీ..ఆడపిల్లలకు కన్నంత మాత్రాన ‘‘వరుడు కాళ్లు కడిగి’’ఇదిగో బాబూ ఇప్పటివరకూ ఆమె మా బిడ్డ ఇక నుంచి ఆమె నీది అంటూ దానం ఇవ్వటం ఏంటీ అటువంటి పద్దతి వద్దు అని నిర్ణయించుకున్నారు. దీంతో పెళ్లిలో ‘‘కన్యాదానం’’ ఘట్టం లేదు.
ప్రకృతిలో స్త్రీపురుషులు ఇద్దరూ సమానం. అటువంటి ప్రకృతిసహజమైన పెళ్లి చేసుకోవాలనుకున్న కమలా శ్రీపాదా..యాగ్నిక్ లు ‘‘సమానత్వ’’మైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో పెళ్లి బట్టలు కొనటం నుంచి అన్ని పనులు ఇద్దరూ సమానంగా చేసుకున్నారు. పెళ్లిలో కన్యాదానం పద్దతిని పాటించలేదు.అలాగే పెళ్లిలో మంత్రాలు చదివినప్పుడు మమా అనుకోవటం..కష్టాల్లోను సుఖాల్లోను ఆమెను విడిచిపెట్టనని వరుడు ప్రమాణం చేసినట్లుగా వధువు కూడా ప్రమాణం చేసింది.
అంతేకాదు..వివాహాంలో అతి ముఖ్యమైన ఘట్టం వధూవరులిద్దరూ అగ్నిసాక్షిగా సప్తపది (ఏడు అడుగులు)వేయటం. దీంట్లో అతి ముఖ్యంగా వరుడు ముందు నడుస్తూంటే వధువు వరుడి ‘‘వెనకాల’’ తల వంచుకుని నడవాలి. కానీ కమలా శ్రీపాదా యోగ్నిక్ లిద్దరూ పెళ్లిలో అతి ముఖ్యమైన ఈ తంతును చాలా ఆధునికంగా..ఆదర్శవంతంగా చేశారు. యోగ్నిక్ పక్కనే కమలా శ్రీపాద నడిచింది. యోగ్నిక్ వెనుకగా కాకుండా పక్కనే నడిచింది.
ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ..భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాలను పంచుకుంటూ ఒకరి అండగా మరొకరు నిలవాలి. అటువంటప్పుడు ఒకరి వెనకాల కాకుండా పక్క పక్కనే నడిస్తే ఎంత బాగుంటుందో కదా..అందుకే మేము ఇలా చేయాలని అనుకున్నామని తెలిపారు. ‘‘సమానంగా’’చేతిలో చేయి వేసుకుని నడవటంతో ఎంత ఆనందముంటుంది..అని సంతోషంగా..సగర్వంగా చెప్పారు.
ఇదంతా చూస్తుంటూ మన తెలుగులు సినిమా ‘‘కలిసి నడుద్దాం’’సహజ నటి సౌందర్య..శ్రీకాంత్ నటించిన ఈ ‘‘కలిసి నడుద్దాం’’సినిమాలో సౌందర్య శ్రీకాంత్ పక్కనే (పెళ్లిలో) నడుస్తుంటే… అమ్మా నువ్వు అమ్మాయివి.. అబ్బాయి పక్కన నడకూడదు కాస్త వెనగ్గా నడవాలి అని పురోహితుడు చెపుతాడు. ఆధునిక భావాలున్న సౌందర్య ఆ మాటకు నొచ్చుకుంటుంది. కానీ కమలా శ్రీపాద..యోగ్నిక్ జంట ఆ సంప్రదాయానికి చెల్లు చీటీ ఇచ్చి కొత్తపద్ధతికి శ్రీకారం చుట్టారు. ‘‘సమానత్వం’’గా పెళ్లి చేసుకున్నారు.
See Also | జీతం కట్ చేసిందని, మహిళా అధికారి దగ్గరకు పెట్రోల్ తీసుకెళ్లింది…