రూ.60లక్షల లాటరీ గెలిచాడు… అంతలోనే గుండెపోటుతో మృతి

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 08:08 AM IST
రూ.60లక్షల లాటరీ గెలిచాడు… అంతలోనే గుండెపోటుతో మృతి

Updated On : March 12, 2020 / 8:08 AM IST

కేరళంలో ఓ వ్యక్తిని రూ.60లక్షలు విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.  వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి దుకాణం నిర్వహిస్తున్నాడు. తంబి ఇటీవల తన దుకాణంలో స్త్రీ శక్తి లాటరీలు కూడా తెచ్చి విక్రయించాడు.

తన వద్ద ఉన్న లాటరీలన్నీ విక్రయించగా.. చివరగా పది టిక్కెట్లు మాత్రం మిగిలిపోయాయి. లాటరీ బహుమతుల ఫలితాలు వెల్లడించగా.. అతడి వద్ద ఉన్న టిక్కెట్లలో ఒకదానికి రూ.60 లక్షల బహుమతి వరించడం విశేషం. దీంతో తంబి సంతోషంతో వెంటనే ఆ నగదు బహుమతి పొందేందుకు ఫెడరల్ బ్యాంక్ కు వెళ్లి టిక్కెట్ ను సమర్పించాడు. 

కానీ ఇంతలోనే అతనికి ఛాతి నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. తంబి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

See Also | ఖమ్మంలో మెడిసిన్‌ విద్యార్థికి కరోనా లక్షణాలు