MiG 21 Crash : కుప్పకూలిన మిగ్-21 బైసన్ : పైలట్ మృతి
సెంట్రల్ ఇండియాలో టేకాఫ్ అయిన మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ మృతిచెందాడు. ఎయిర్ బేస్ నుంచి యుద్ధ శిక్షణ కోసం బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది.

Mig 21 ‘bison’ Crashes In Central India, Pilot Killed
MiG-21 Bison Crash : సెంట్రల్ ఇండియాలో టేకాఫ్ అయిన మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ మృతిచెందాడు. ఎయిర్ బేస్ నుంచి యుద్ధ శిక్షణ కోసం బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది.
‘విమాన ప్రమాదంలో ఐఎఫ్ గ్రూపు కెప్టెన్ ఏ గుప్తాను కోల్పోయాం. ఈ ఘటనపై ఐఏఎఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పైలట్ గుప్తా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానభూతిని తెలియజేస్తున్నాం’ అని ఐఏఎఫ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
The IAF lost Group Captain A Gupta in the tragic accident. IAF expresses deep condolences and stands firmly with the family members. A Court of Inquiry has been ordered to determine the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) March 17, 2021
మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో దర్యాప్తు జరిపిస్తామని ఐఎఫ్ ప్రకటనలో పేర్కొంది.