1700కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం: సొంతూరికి వెళ్లాలని మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకూ

సొంతూరికి వెళ్లడం ఒకటే టార్గెట్. 20 ఏళ్ల కుర్రాడి దగ్గర రూట్ మ్యాప్ కూడా లేదు. కేవలం అతనికి తెలిసింది రైల్వే స్టేషన్ల పేర్లు మాత్రమే. మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకూ అతను ప్రయాణం చేయడానికి అవే ఆధారం. ఒడిశాలోని జైపూర్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని సొంతింటికి వెళ్లేందుకు 7రోజుల పాటు 1700కిలోమీటర్ల ప్రయాణించాడు.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మొత్తం నిలిచిపోయిన వేళ అతని దగ్గర ఉన్న సైకిల్ ఆధారంగానే బయల్దేరాడు. మిరాజ్ MIDC ఇండస్ట్రియల్ ఏరియాలో నెలకు రూ15వేలు జీతానికి పనిచేసే మహేశ్.. లాక్ డౌన్ అయిన తర్వాత పని లేకపోవడంతో ఇంటికి బయల్దేరాడు. ఇండస్ట్రీ మరో 3నెలల వరకూ మూసే ఉంటుందని రూమర్లు వినిపించడంతో అతని దగ్గర ఉన్న రూ.3వేలతో ప్రయాణం మొదలుపెట్టాడు.
అతను అక్కడ ఉండటానికి నెలకు రూ.6వేలు కావాలి. ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని ఎవరు అప్పు ఇచ్చే వాళ్లు కూడా లేరని సిద్ధమయ్యాడు. ‘జైపూర్ లోని బడసూరి గ్రామానికి సైకిల్ పై వెళ్లాలని డిసైడ్ అయ్యా. ఏప్రిల్ 1న బయల్దేరా. నా దగ్గర మ్యాప్ కూడా లేదు. కేవలం నాకు గుర్తుంది ప్రధాన రైల్వే స్టేషన్లు మాత్రమే. నాతో పాటు పనిచేసే వాళ్లు సైకిల్ పై అంత దూరం వెళ్లొద్దని నన్ను హెచ్చరించారు.
రోజూ పనిచేసేందుకు రూ.12కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఫ్యాక్టరీకి వెళ్లేవాడ్ని. తెల్లారి లేచి తిన్న తర్వాత లంచ్ టైం వరకూ సైకిల్ తొక్కేవాడ్ని. ట్రక్ డ్రైవర్ల కోసం అక్కడక్కడ ధాబాలు ఓపెన్ చేసి ఉన్నాయి. మధ్యలో 2నుంచి 3గంటలు రెస్ట్ తీసుకుని మళ్లీ సైకిల్ సీట్ ఎక్కడమే.
ఈ ప్రయాణం మొదలైయ్యాక రోజుకు 200కిలోమీటర్ల ప్రయాణం చేసేవాడ్ని. కొందరు ట్రక్ డ్రైవర్లు వారితో పాటు ఎక్కించుకుని తీసుకెళ్తా అని చెప్పి.. మళ్లీ డ్రాప్ అయ్యేవారు. వారికి పర్మిషన్ లేదని మళ్లీ వదిలేసేవారు. మహేశ్.. సోలాపూర్-హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం రూట్ మీదుగా ఒడిశాలోని గంజం జిల్లాకు చేరుకున్నాడు.
మధ్యలో ఎండ నాపై ప్రభావం చూపించింది. ఆ కారణంగా వెనుకడుగేయలేదు. ఇంటికి వెళ్లాలని ఒకటే ఫోకస్ పెట్టుకున్నా. నైట్ సమయంలో గుడులు, బడలు, లేదా ధాబాల్లో ఆగేవాడ్ని. మహరాష్ట్ర బోర్డర్లో పోలీసులు అడిగినప్పుడు సైకిల్ జర్నీ గురించి విని ఆశ్చర్యపోయారు. రోజుకు 16గంటలు సైకిల్ పైనే ప్రయాణం. జర్నీ మొదలైన 4రోజుల తర్వాత కొత్త వ్యక్తి మొబైల్ ఫోన్ తో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు.
భయపడిన కుటుంబం పలు జాగ్రత్తలు చెప్పారు. ఏప్రిల్ 7నాటికి జైపూర్ జిల్లాకు చేరుకున్న మహేశ్‌ను గ్రామంలోకి వచ్చేందుకు నిరాకరించారు. జైపూర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు సమాచారం అందించి బిచిత్రాపూర్లోని స్కూల్లోని క్వారంటైన్ సెంటర్ కు పంపించారు. ఈ క్వారంటైన్ సెంటర్లో బోర్ కంటే ఏడు రోజుల సైకిల్ ప్రయాణమే బాగుందంటున్నాడు మహేశ్.