ఎటకారం ఎక్కువైంది : ఈసారి యుద్ధ విమానానికి కట్టి పంపిస్తాం
సర్జికల్ దాడులు ఎలా చేశారు.. ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు.. అసలు దాడులు చేశారా లేదా.. చేస్తే చనిపోయిన ఉగ్రవాదుల లెక్క ఎందుకు చెప్పటం లేదు.. ఇలాంటి బోలెడు సందేహాలతో ప్రశ్నల వర్షం కురిపించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వీకే సింగ్.

సర్జికల్ దాడులు ఎలా చేశారు.. ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు.. అసలు దాడులు చేశారా లేదా.. చేస్తే చనిపోయిన ఉగ్రవాదుల లెక్క ఎందుకు చెప్పటం లేదు.. ఇలాంటి బోలెడు సందేహాలతో ప్రశ్నల వర్షం కురిపించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వీకే సింగ్.
సర్జికల్ దాడులు ఎలా చేశారు.. ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు.. అసలు దాడులు చేశారా లేదా.. చేస్తే చనిపోయిన ఉగ్రవాదుల లెక్క ఎందుకు చెప్పటం లేదు.. ఇలాంటి బోలెడు సందేహాలతో ప్రశ్నల వర్షం కురిపించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వీకే సింగ్. ఈయన మాజీ ఆర్మీ చీఫ్ కూడా కావటం విశేషం. ఇంతకీ ఆయన ఎమన్నారో తెలుసా… ఉగ్రమూకలను ఏరివేయటానికి ఎంతో సాహసంతో.. సరిహద్దులు దాటి మరీ మన యుద్ధ విమానాలు శిబిరాలను ధ్వంసం చేస్తే రాజకీయం చేస్తారా అని నిలదీశారు. ఇలాంటి ప్రశ్నలు వేసే అందర్నీ ఈసారి యుద్ధ విమానాలకు కట్టి పంపించాలి.. అప్పుడు తెలుస్తుంది అంటూ చురకలు అంటించారు.
Also Read : ఎట్టా ఇచ్చారు : ఆకాశంలో భూమి.. నకిలీ మనుషులు.. రూ.2 కోట్ల బ్యాంక్ లోన్
ఈసారి దాడులు చేసే సమయంలో ఇలాంటి వారిని కూడా.. యుద్ధ విమానాలకు కట్టి పంపిస్తాం.. లెక్కపెట్టి వస్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టూమచ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. యుద్ధ విమానాలకు టార్గెట్ ఉంటుంది.. పైలెట్లు వారి పని ముగించుకుని క్షణాల్లో వచ్చేస్తుంటారని చెప్పుకొచ్చారు. అలాకాకుండా ఎంత మంది చనిపోయారు.. ఎన్ని శిబిరాలు కచ్చితంగా ధ్వంసం అయ్యాయి అని లెక్కేయటానికి సమయం ఉండదని చెప్పుకొచ్చారు. ఇది అసంబద్ధమైన ప్రశ్న అని.. ఇలాంటి వారిని ఈసారి విమానాలకు కట్టి పంపిస్తాం అంటూ చురకలు అంటించారు.
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే
సరిగ్గా రాత్రి 3.30 గంటల సమయం. అప్పుడు నేను నిద్రపోతున్నా. ఇంట్లో దోమలన్నీ నన్ను చుట్టుముట్టాయి. వెంటనే దోమలకు విరుగుడుగా హిట్ వాడాను. హిట్ దెబ్బకు దోమలన్నీ చనిపోయాయి. ఇప్పుడు నేను ఎన్నో దోమలు చంపానో లెక్కించుకుంటూ ఉండాలా? లేదా నిద్రపోవాలా? అని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ వ్యంగ్యంగా హిందీలో ట్వీట్ చేశారు.
रात ३.३० बजे मच्छर बहुत थे,
तो मैंने HIT मारा।
अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ,
या आराम से सो जाऊँ? #GenerallySaying
— Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019