కూలిన జెట్‌ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 09:43 AM IST
కూలిన జెట్‌ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

Updated On : February 1, 2019 / 9:43 AM IST

బెంగళూరు : హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) విమానాశ్రయం వద్ద ఓ ఫైటర్‌ జెట్‌ విమానం కూలిన దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. భారత వాయుసేకు చెందిన మిరాజ్‌ 2000 విమానానికి ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయానికి విమానంలో ఇద్దరు పైలెట్లు ఉండగా ఒకరు చనిపోగా మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు, సహాయక సిబ్బంది, రెస్క్యూ హెలికాప్టర్లు రంగంలోకి దిగి ప్రాణాలతో ఉన్న పైలట్‌ను రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 

2019, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మిరాజ్ 2000లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ల్యాండ్ మీద ఉన్నకూడా బయటకు రాలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిని బలవంతంగా బయటకు తీశారు. అప్పటికే ఈ ఘోరం జరిగిపోయింది.