Miss Diva Universe 2023 : మిస్ దివా యూనివర్శ్ 2023గా శ్వేతా శారదా

చండీగఢ్‌ నగరానికి చెందిన శ్వేతా శారదా మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని పొందింది. సోనాల్ కుక్రేజా మిస్ దివా సుప్రానేషనల్, త్రిష శెట్టి మిస్ దివా రన్నరప్ కిరీటాన్ని గెలుచుకున్నారు.....

Miss Diva Universe 2023 : మిస్ దివా యూనివర్శ్ 2023గా శ్వేతా శారదా

Miss Diva Universe 2023 Shweta Sharda

Updated On : August 28, 2023 / 9:35 AM IST

Miss Diva Universe 2023 : చండీగఢ్‌ నగరానికి చెందిన శ్వేతా శారదా మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని పొందింది. సోనాల్ కుక్రేజా మిస్ దివా సుప్రానేషనల్, త్రిష శెట్టి మిస్ దివా రన్నరప్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆదివారం రాత్రి ముంబయి నగరంలో జరిగిన స్టార్-స్టడెడ్ వేడుకలో శ్వేతా శారదా మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని గెలుచుకుంది. (Miss Diva Universe 2023 is Shweta Sharda) ఈ ఈవెంట్‌లో మిస్ దివా యూనివర్స్ 2022 దివితా రాయ్ శ్వేతకు కిరీటాన్ని అందించారు.

Rozgar Mela : రోజ్‌గార్ మేళాలో 51వేలమంది అభ్యర్థులకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లు

ఈ పోటీల్లో ఢిల్లీకి చెందిన సోనాల్ కుక్రేజా మిస్ దివా సుప్రానేషనల్ 2023 కిరీటాన్ని, కర్ణాటకకు చెందిన త్రిష శెట్టి మిస్ దివా 2023 రన్నరప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. శ్వేతా శారదా 72వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ సుప్రనేషనల్ 12వ ఎడిషన్‌లో సోనాల్ కుక్రేజా భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించండి : హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి డిమాండ్

మిస్ దివా యూనివర్స్ 2023 శ్వేతా శారదా చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి. ఒంటరి తల్లి వద్ద పెరిగిన శ్వేతా తన కలలను సాకారం చేసుకునేందు కోసం 16 సంవత్సరాల వయస్సులో ముంబయికు మకాం మార్చారు. తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు శ్వేత తన తల్లి అని చెప్పారు.

Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు మరో బంగారుపతకం

అందాల రాణి డిఐడి, డ్యాన్స్ దీవానే,డ్యాన్స్+ వంటి షోలలో ఈమె పాల్గొన్నారు. దీపికా పదుకొనే, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, మౌని రాయ్, మాధురీ దీక్షిత్‌లకు నృత్యం నేర్పించడం తాను గర్వించదగ్గ విషయమని శ్వేత చెప్పారు. తనను అందాల రాణి సుస్మితా సేన్ ప్రేరణగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.

Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర కన్నుమూత

మిస్ దివా యూనివర్స్ 2023 గ్రాండ్ ఫినాలేలో డిజైనర్లు అభిషేక్ శర్మ, నికితా మహైసల్కర్, జతిన్ కంపానీ, మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు, ప్రతీక్ గాంధీ, శ్రీనిధి శెట్టి,సంగీతా బిజ్లానీలు న్యాయనిర్ణేతల ప్యానెల్‌లో ఉన్నారు.