Miss Universe 2021 : విశ్వసుందరి హర్నాజ్ కౌర్ సంధు..ఈమె ఎవరు ?
21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబం లో 2000 సంవత్సరంలో జన్మించింది...21ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ తీసుకొచ్చింది ఈ పంజాబీ మిలీనియం గర్ల్.

Miss 2021
Harnaaz Sandhu : రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. విశ్వసుందరి కిరీటం భారత్‌కు దక్కింది. మిస్ యూనివర్స్‌గా భారత్ అందాల భామ హర్నాజ్ కౌర్ సంధు గెలుపొందింది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 దేశాల భామలను వెనక్కి నెట్టి..హర్నాజ్ విశ్వసుందరి టైటిల్ గెలుచుకుంది. భారత్ చివరిసారిగా 2000లో సంవత్సరంలో మిస్ యూనివర్శ్ గెలుచుకుంది. 1994లో తొలిసారి సుస్మితాసేన్ విశ్వసుందరిగా అవతరించింది. 2000లో లారా దత్తా గెలుచుకున్న తర్వాత..20ఏళ్లుగా భారత్‌కు మిస్ యూనివర్స్ టైటిల్ దక్కలేదు. లారాదత్త కిరీటం గెలుచుకున్న ఏడాదే జన్మించిన ఈ మిలీనియం గర్ల్ హర్నాజ్ కౌర్ సంధు.. ప్రస్తుతం భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చింది. గత ఏడాది విశ్వసుందరి, మెక్సికో భామ ఆండ్రియా మేజా హర్నాజ్‌కు మిస్ యూనివర్స్ కిరీటం అలంకరించింది. ఈ సమయంలో హర్నాజ్ భావోద్వేగానికి గురయ్యారు.
Read More : Miss Universe 2021 : విశ్వసుందరిగా హర్నాజ్ కౌర్ సంధు
21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబం లో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్‌నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది.
Read More : Miss Universe : మిస్ యూనివర్స్‌కు అడుగు దూరంలో హర్నాజ్ కౌర్ సంధు
ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో మిస్ చంఢీఘడ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఏడాది ‘మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా’ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు టైటిల్స్ గెలుచుకున్న తరువాత…2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్-12 జాబితాలో నిలిచింది. ఇదే ఏడాది ‘మిస్ ఇండియా పంజాబ్‌గా కూడా నిలిచింది. మంచి పాపులారిటీ రావడంతో ద ల్యాండర్స్ రూపొందించిన మ్యూజిక్ వీడియో ‘తార్తల్లి’లో నటించింది. ఆ తరువాత అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ దివా యూనివర్స్ ఇండియా-2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్కిన్, మిస్ బీచ్ బాడీ, మిస్ బ్యూటీఫుల్, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ ఫోటోజెనిక్, మిస్ టాలెంటెడ్‌గా నిలిచింది. ఈ కిరీటం ద్వారానే ‘మిస్ యూనివర్స్’2021కు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది హర్నాజ్. అదే సత్తా ఇప్పుడు ప్రపంచవేదికపై చాటింది. భారత్‌కు 21ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ తీసుకొచ్చింది ఈ పంజాబీ మిలీనియం గర్ల్.