Kamal Haasan: కమల్ హాసన్ కు గట్టి షాక్.. “వాడో ద్రోహి” అన్న అధినేత

తమిళనాడులో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం బరిలో నిలిచింది. ఈ పార్టీ ఉహించినంతగా తన ప్రభావం చూపలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా ఓటమి చవిచూశారు.

Kamal Haasan: కమల్ హాసన్ కు గట్టి షాక్.. “వాడో ద్రోహి” అన్న అధినేత

Kamal Haasan

Updated On : May 7, 2021 / 5:51 PM IST

Kamal Haasan: తమిళనాడులో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం బరిలో నిలిచింది. ఈ పార్టీ ఉహించినంతగా తన ప్రభావం చూపలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా ఓటమి చవిచూశారు. ఇక ఇదిలా ఉంటే.. ఎన్నికలు పూర్తైన నాటి నుంచి పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ రాజీనామా చేశాడు.

ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పై విమర్శలు గుప్పించారు. కమల్ వ్యవహారశైలి పార్టీలో చాలామందికి నచ్చడం లేదని తెలిపారు.. చాలా కాలంగా కమల్ వెంట నడుస్తున్నానని కానీ అతడు తన ప్రవర్తన మార్చుకోవడం లేదని అన్నారు. భవిష్యత్ తన ప్రవర్తనలో మార్పు వస్తుందని తాను భావించడం లేదని మహేంద్రన్ వ్యాఖ్యానించారు. ఇక పార్టీ నేతల రాజీనామాపై కమల్ హాసన్ స్పందించారు. ఎవరు వెళ్లినా తన పార్టీకి నష్టం లేదని, మహేంద్రన్ ఒక ద్రోహి అని విమర్శలు గుప్పించారు.

మహేంద్రన్ రాజీనామా చెయ్యకపోతే తానే పార్టీలోంచి పంపేవాడినని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం గా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు 34 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.