మోదీ క్యాబినెట్‌లో వారిదే అగ్రస్థానం.. సాయంత్రం 5గంటలకు తొలి కేంద్ర క్యాబినెట్ భేటి
ఇవాళ సాయంత్రం 5గంటలకు తొలి కేంద్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. శాఖల కేటాయింపు తరువాత కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.

Modi 3.0 Cabinet
Central Cabinet meeting : మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ 3.0 క్యాబినెట్ బృందం ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేసింది. మొత్తం 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు 11 మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రధాని మోదీ క్యాబినెట్ లో బీజేపీ నేతలకు అగ్రస్థానం లభించింది.
Also Read : Narendra Modi : ప్రధాని మోదీకి ఏపీ మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు
మోదీ క్యాబినెట్ లో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా 61 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులుగా మోదీ అవకాశం కల్పించారు. వీరిలో రాజ్ నాథ్ సింగ్ (యూపీ), శివరాజ్ సింగ్ చౌహాన్ (ఎంపీ), మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా), శర్బానంద సోనోవాల్ (అస్సాం), హెచ్ డీ కుమారస్వామి (కర్ణాటక), జితన్ రామ్ మాంఝీ (బీహార్). ఇదిలాఉంటే.. మోదీ క్యాబినెట్ లో తిరిగి మంత్రి పదవులు పొందిన వారు 34 మంది ఉండగా.. వారిలో 19మందిది క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. ఇదిలాఉంటే.. మోదీ క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఏఏ శాఖ దక్కతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రుల శాఖలపై స్పష్టత రానుంది. శాఖల కేటాయింపుపై మంత్రులకు ప్రధాని కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. సాయంత్రం 5గంటలకు తొలి కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. శాఖల కేటాయింపు తరువాత కేంద్ర మంత్రులకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read : Narendra Modi: సరికొత్త ప్రధానిని మోదీలో చూడబోతున్నామా? ఎందుకంటే?
మోదీ 3.0 క్యాబినెట్ లో ఓబీసీ, ఎస్ఈబీసీలకు అధిక ప్రాధాన్యత తగ్గింది. ఓబీసీ నుంచి 27 మంది, ఎస్ఈబీసీ నుంచి ఇద్దరు మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జనరల్ కేటగిరి నుంచి 28 మంది మంత్రులు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) నుంచి 10మంది, షెడ్యూల్ తెగల కేటగిరి నుంచి ఐదుగురు మోదీ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రాలపరంగా చూస్తే యూపీ నుంచి 10మంది, బీహార్ నుంచి ఎనిమిది మందికి మోదీ క్యాబినెట్ లో చోటు దక్కింది. యూపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, కమలేష్ పాశ్వాన్, ఎస్పీ సింగ్ బాఘేల్, బీఎల్ వర్మ, కీర్తివర్ధన్ సింగ్, ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి, ఆప్పాదళ్ (సోనేలాల్) అధినేత అనుప్రియా పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ రాష్ట్రం నుంచి ఎనిమిది మందిలో నలుగురు బీజేపీ నేతలు కాగా.. జేడీయూ నుంచి ఇద్దరు, ఎల్జీపీ, హెచ్ఏఎం పార్టీ ల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.