బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 11:55 AM IST
బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

Updated On : February 27, 2019 / 11:55 AM IST

భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.కనీసం ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియని వ్యక్తిని బీజేపీ ఐటీ హెడ్ గా పెట్టుకుందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

అమిత్ మాల్వియా తను చేసిన ట్వీట్ లో.. ఇన్నేళ్లలో కుంభమేళాలో పాల్గొన్న  భారత దేశాధినేత(హెడ్ ఆఫ్ స్టేట్) మోడీనే అని తెలిపారు. అయితే దేశాధినేత అంటే భారత్ కు రాష్ట్ర్రపతే. 1953లోనే కుంభమేళాలో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన తర్వాత కుంభమేళాలో పాల్గొన్న రాష్ట్రపతిని తానేనంటూ జనవరి-17,2019న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వయంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కుంభమేళాలో పాల్గొన్న మొదటి ప్రధాని మోడీ అనుకుందామనుకున్నా కూడా భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1954, జనవరి నెలలో కుంభమేళాలో పాల్గొన్నారు. 1977లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా కుంభమేళాను సందర్శించినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సమయంలో అమిత్ మాల్వియా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఆయనకు ప్రధానికి,రాష్ట్రపతికి కూడా తెలియదా? అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. మోడీ భజనలో ఆయనేం చెబుతున్నారో ఆయనకైనా అర్థం అయిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

	nehru.jpegmith.png