‘మనీ లాండరింగ్ కేసులో జైలుకు పంపినా ఓకే’

‘మనీ లాండరింగ్ కేసులో జైలుకు పంపినా ఓకే’

Updated On : September 25, 2019 / 10:50 AM IST

కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌పై ఎన్‌ఫోర్స్ డైరక్టరేట్(ఈడీ) ఆరోపణలపై జైలుకు వెళ్లాల్సి వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తే స్వగతిస్తానని, జైలు జీవితాన్ని ఎంజాయ్ చేస్తానన్నారు. 

‘ఈ కేసులో నేను జైలుకు వెళ్లాల్సి వస్తే దానికి నాకేం ఇబ్బంది లేదు. నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటివరకూ తెలియని దానిని ఎక్స్‌పీరియన్స్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా నన్ను కటకటాల వెనక్కి నెట్టాలనుకుని భావిస్తే దానిని నేను స్వగతిస్తాను. త్వరలో ఎన్నికల జరుగుతున్న సమయంలో ఈ ఈడీ చర్యకు నేను హ్యాపీగానే ఉన్నాను’ అని శరద్ పవార్ వెల్లడించారు. బొంబే హైకోర్టు ఆదేశానుసారాల మేరకు ముంబై పోలీసుల సహకారంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.  

సెప్టెంబర్ 23వ తేదీన మహారాష్ట్ర కో ఆపరేటివ్ 5వేల కోట్ల స్కాం కేసులో ఎన్సీపీ చీఫ్, పార్టీ లీడర్ అజిత్ పవార్‌తో పాటు మరి కొందరి పేర్లను ఎన్స్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌లో బయటపెట్టింది. ఇందులో శరద్ పవార్‌ను మాత్రమే కాకుండా అతని మేనల్లుడు అజిత్ పవార్, దిలీప్ రావ్ దేశ్ ముఖ్, ఇషార్లాల్ జైన్, జయంత్ పాటిల్, శివాజీ రావు నల్వాడె, ఆనంద్ రావు అడ్సుల్, రాజేంద్ర శింగానె, మదన్ పాటిల్‌ల పేర్లను చేర్చింది.