Viral Video : డబ్బు చెట్టుని చూసారా? కొమ్మ కొమ్మకి నాణాలే నాణాలు..

డబ్బుని వేస్ట్ చేస్తుంటే ఇంట్లో వాళ్లు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? అంటూ కసురుతారు. మాట వరసకు అలా అంటారు కానీ.. నిజంగానే చెట్లకు డబ్బు కాస్తుందా? ఒక వైరల్ వీడియో చూస్తే మాత్రం డబ్బు చెట్లు ఉంటాయా? అని డౌట్ వస్తోంది.

Viral Video : డబ్బు చెట్టుని చూసారా? కొమ్మ కొమ్మకి నాణాలే నాణాలు..

Viral Video

Viral Video : డబ్బు చెట్లకు కాస్తుందా? అంటారు చాలామంది. కానీ ఓ వీడియో చూస్తే నిజంగా డబ్బు చెట్లు ఉన్నాయా? అని అనుమానం వస్తుంది. ఒక చెట్టు కొమ్మల్లో నాణాలే నాణాలే.. వాటిని తీసుకోవాలని ఓ కుటుంబం ఎగబడింది. రాళ్లతో కొట్టి నాణాలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allari Naresh : పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద అల్లరి నరేష్ సినిమా.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ

ఆర్ధికంగా బాగుండాలని కొంతమంది సెంటిమెంట్ కొద్దీ రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెడుతుంటారు. ముఖ్యంగా మనీ ప్లాంట్ వంటి మొక్కల్ని. అయితే రీసెంట్‌గా ఓ చెట్టు కొమ్మలకు నాణాలు కనపడ్డాయి. ఇక జనాలకు వింతగా అనిపించింది. చెట్టుకి నాణాలు కాస్తున్నాయని ఆశ్చర్యపోయారు. అయితే ఇది నిజమేనా? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చెట్టు కొమ్మలకు అత్తుక్కుని అనేక నాణాలు కనిపించాయి. ఒక కుటుంబం  రాళ్లతో వాటిని కొట్టి తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. వీడియోకి ‘రాజగిరి (బీహార్)లో డబ్బు చెట్టు’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా? నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో భిన్న స్పందనలు వచ్చాయి. ‘ఫైనల్ గా మనీ ప్లాంట్ కనుగొన్నారు’ అని కొందరు..’ఈ వీడియోను అలా ఎడిట్ చేసారని’ మరికొందరు కామెంట్స్ చేసారు. కొందరు చెట్లను దేవుడిగా కొలుస్తారు. వారి కోరికలు నెరవేరాలని పూజలు చేస్తారు. ఆ సమయంలో చెట్లపై నాణాలు విసురుతారు. అలా 100 సంవత్సరాలుగా ఈ చెట్టుపై నాణాలు విసరడం వల్ల అవి చెట్లపై అతుక్కుపోయాయని కొందరు చెబుతున్నారు. దాంతో చెట్టుకు నాణాలు కాసినట్లు కనిపిస్తోంది అంటున్నారు. అదన్నమాట విషయం. ఈ డబ్బు చెట్టు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by अन्नत बिहारी (@anantbihari_)