Uttar Pradesh : బైక్ నుండి రూ. 1.5 లక్షలు ఎత్తుకుపోయిన చేసిన కోతి
ఓ కోతి బైక్ నుంచి డబ్బులు కొట్టేసింది. డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి లబో దిబో అన్నాడు. ఇక అందరూ దాని వెంట పరుగులు పెట్టారు. కోతి దొరికిందా.. డబ్బులు దొరికాయా? చదవండి.

Uttar Pradesh
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఓ కోతి బైక్ నుంచి రూ.1.5 లక్షలు దొంగతనం చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదా. రిజిస్ట్రార్ కార్యాలయం బయట ఈ ఘటన జరిగింది. అయితే కోతి దొంగిలించిన సొమ్ము తిరిగి పట్టుకున్నారా, లేదా?
‘Most Wanted Monkey : కంత్రీ కోతి .. పట్టుకున్నందుకు రూ.21,000 వేలు బహుమతి
ఉత్తరప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయానికి షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి సేల్ డీడ్ కోసం వచ్చాడు. కార్యాలయం బయట అతని బైక్‌ను పార్క్ చేశాడు. అటుగా వచ్చిన కోతి అతని బైక్‌కి ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకుపోయింది.
ఆ బ్యాగ్‌లో రూ.1.5 లక్షల రూపాయల సొత్తు ఉంది. ఇంక షరాఫత్ లబోదిబో అన్నాడు. కార్యాలయం బయట గందరగోళం నెలకొంది. అయితే అప్పటికే కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతనితో పాటు స్ధానికులు దాని జాడ కోసం ప్రయత్నం చేయగా.. చేయగా కోతి కనిపించింది. డబ్బుల బ్యాగ్ సేఫ్‌గా దొరికింది. దాని వెంట పరుగులు తీసిన వారితో పాటు డబ్బులు పోగొట్టుకున్న షరాఫత్ ఊపిరి పీల్చుకున్నాడు.
Macaque Monkey : అరుదైన మకాక్ జాతి కోతి పిల్ల.. బ్రిటన్ చెస్టర్ జూలో జననం
ఇక అక్కడ కోతుల బెడద విపరీతంగా ఉండటం నిజమే అని షహాబాద్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనిల్ కుమార్ అంగీకరించారు. త్వరలోనే వీటిని పట్టుకుని సురక్షితంగా అడవుల్లో విడిచిపెడతామని స్ధానికులకు హామీ ఇచ్చారు.