టోల్ గేట్ క్యాబిన్ లో రూ.5 వేలు ఎత్తుకెళ్లిన కోతి

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ కోతి హల్ చల్ చేసింది. టోల్ గేట్ సిబ్బంది క్యాబిన్ లోకి ప్రవేశించిన కోతి… రూ.5 వేలు ఎత్తుకెళ్లింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. కాన్పూర్ డెహత్ ప్రాంతంలోని బారాటోల్ ప్లాజాలో ఓ కారు ఆగింది. ఆ కారు కిటికిలో నుంచి బయటికి వచ్చిన కోతి టోల్ గేట్ సిబ్బంది క్యాబిన్ లోకి ప్రవేశించింది. కౌంటర్ లో ఉన్న డబ్బుల్లో చేతికి అందిన కాడికి తీసుకుని ఉడాయించింది. అకస్మాత్తుగా కోతి ప్రవేశించడంతో టోల్ వసూలు చేస్తున్న వ్యక్తి భయంతో వణికిపోయాడు. కోతి దగ్గర నుంచి డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.