“సైకిల్” గుర్తుకు ఓటెయ్యాలి : పోలింగ్ అధికారిని చావగొట్టిన బీజేపీ కార్యకర్తలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 23, 2019 / 05:49 AM IST
“సైకిల్” గుర్తుకు ఓటెయ్యాలి : పోలింగ్ అధికారిని చావగొట్టిన బీజేపీ కార్యకర్తలు

Updated On : April 23, 2019 / 5:49 AM IST

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని ఎన్నికల అధికారిని బీజేపీ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలింగ్ బూత్ నెంబర్ 231లో వోటర్లను సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన  సైకిల్ కు ఓటెయ్యాలంటూ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు.రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చక్కదిద్దడంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు మంగళవారం(ఏప్రిల్-23,2019)పోలింగ్ జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని 10లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది.