Nipah virus : కరోనా కంటే నిపా వైరస్ మరణాల రేటు అధికం…ఐసీఎంఆర్ హెచ్చరిక

కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్‌లో మరణాల రేటు 2-3 శాతం ఉందని ఆయన చెప్పారు....

Nipah virus : కరోనా కంటే నిపా వైరస్ మరణాల రేటు అధికం…ఐసీఎంఆర్ హెచ్చరిక

Nipah virus

Nipah virus : కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్‌లో మరణాల రేటు 2-3 శాతం ఉందని ఆయన చెప్పారు. (Mortality rate way higher for Nipah virus than coronavirus) కేరళలో యాక్టివ్ నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, దీని చికిత్స కోసం ఆస్ట్రేలియా నుంచి 20 డోసుల మోనోక్లోనల్ యాంటీబాడీని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

రోజూ 6గంటల కంటే తక్కువ నిద్రపోతే గుండెపోటు..!

నిపా వైరస్ అనేది జూనోటిక్ వ్యాధి. ఈ వ్యాధి జంతువుల నుంచి ప్రజలకు సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది. కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ ఆరుగురికి సోకగా, అందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన 14 మంది రోగులకు మాత్రమే మోనోక్లోనల్ యాంటీబాడీని అందించారు.

Maoist Leader Sanjay Deepakrao : దీపక్ రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

దీంతో 14 మంది రోగులు ప్రాణాలతో బయటపడ్డారు. మోనోక్లోనల్ యాంటీబాడీని కారుణ్య వినియోగ ఔషధంగా మాత్రమే ఇవ్వగలమని రాజీవ్ బహ్ల్ తెలిపారు. యాంటీబాడీని ఉపయోగించాలనే నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం, వైద్యులు, రోగుల కుటుంబాలకు వదిలివేస్తామని రాజీవ్ బహ్ల్ చెప్పారు. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 24వతేదీ వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.