Mother Killed Child: మూడు నెలల బిడ్డ గొంతుకోసిన తల్లి.. కొడుకుతో కలిసి మాయం చేయాలనుకుని..

పల్లవి భోంగే అనే మహిళ 13ఏళ్ల తన కొడుకుతో కలిసి మృతదేహాన్ని మాయం చేయాలనుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.

Mother Killed Child: మూడు నెలల బిడ్డ గొంతుకోసిన తల్లి.. కొడుకుతో కలిసి మాయం చేయాలనుకుని..

Crime

Updated On : October 25, 2021 / 12:15 PM IST

Mother Killed Child: మూడేళ్ల బిడ్డను గొంతు కోసి చంపిందొక తల్లి. ఈ ఘటన పూణెలోని యరవాడ ఏరియాలో జరిగింది. పల్లవి భోంగే అనే మహిళ 13ఏళ్ల తన కొడుకుతో కలిసి మృతదేహాన్ని మాయం చేయాలనుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. ప్రాథమిక విచారణలో మహిళ వివాహేతర సంబంధమే ఈ నేరానికి దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు.

బుల్ధానాలో ఉండే మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యాభర్తలతో తరచూ గొడవలు వస్తుండటంతో దూరంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెకు గర్భిణీ రావడంతో గ్రామమంతా వేరే వ్యక్తితో పెట్టుకున్న సంబంధం గురించి ప్రచారం జరిగిపోయింది. మూడు నెలల తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

డెలివరీ అయిన తర్వాత బిడ్డను దారుణంగా చంపేసిన తల్లి.. 13ఏళ్ల కొడుకు సాయంతో మృతదేహాన్ని మాయం చేయాలనుకుని ప్రయత్నించింది. ఇంటికి దగ్గర్లో ఉన్న నదిలో విసిరేయాలని చెప్పి పంపించింది. తనతో పాటు తీసుకెళ్లిన సంచిని నదిలో విసిరేందుకు వెళ్లగా.. అనుమానంతో కొందరు ప్రశ్నించి పోలీసులకు చెప్పారు.

………………………………………: బంగారానికి డిమాండ్.. భారీగా పెరగుతున్న ధరలు

పోలీసుల విచారణలో మైనర్ బాలుడు నిజం బయటపెట్టాడు. అతని చేతిలో ఉన్న సంచిలో రాళ్ల కింద చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు.