Gold Rate: బంగారానికి డిమాండ్.. భారీగా పెరగుతున్న ధరలు

దేశంలో పండుగ సీజన్ వచ్చేసింది. వరుసగా పండుగలు, తర్వాత పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో భారీ పెరుగుదల కనిపిస్తుంది.

Gold Rate: బంగారానికి డిమాండ్.. భారీగా పెరగుతున్న ధరలు

Gold Price Today

Gold Rate: దేశంలో పండుగ సీజన్ వచ్చేసింది. వరుసగా పండుగలు, తర్వాత పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఒక వారం పాటు బంగారం, వెండి ధరలలో నిరంతరం పెరుగుదల ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. అక్టోబర్ 24వ తేదీన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉంది. అదే సమయంలో, అక్టోబర్ 25న, అంటే ఈరోజు, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,660కి చేరుకుంది. నిన్నటి ట్రేడింగ్ ధర కంటే రూ .10 ఎక్కువగా ఈరోజు ఉంది.

వెండి విషయానికి వస్తే, అక్టోబర్ 24 న, వెండి ట్రేడింగ్ ధర కిలో 65,600గా ఉంది. నేడు దాని ధర కిలోకు 66,000గా ఉంది. ఇవాళ వెండి ధర నిన్నటి ధర కంటే రూ.400 ఎక్కువ. ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా భారతదేశం అంతటా బంగారం, వెండి ఆభరణాల ధర మారుతుంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,910 కాగా.. వెండి కిలో రూ. 66000 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,660 ఉండగా.. వెండి కిలో రూ. 66000గా ఉంది. కోల్‌కతాలో బంగారం ధర రూ.47,010, బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.44,760. అదే సమయంలో, హైదరాబాద్‌లో, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44, 850గా ఉంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
నిజానికి, బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ హాల్ మార్కులు ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. దేశంలో అత్యధికంగా బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతోంది. ఎంత ఎక్కువ క్యారెట్ బంగారాన్ని కొనుగోలు చేస్తే, అంత స్వచ్ఛమైన బంగారం అంటారు.

22 మరియు 24 క్యారెట్‌ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల హాల్‌మార్క్ బంగారం 99.9 శాతం వరకు స్వచ్ఛమైనది. 22 క్యారెట్ బంగారం 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి 9 శాతం విభిన్న లోహాలు 22 క్యారెట్ల బంగారంలో కల్తీ చేస్తారు. 24 క్యారెట్ల బంగారం పూర్తిగా స్వచ్ఛమైనది. అయితే 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయడం కష్టం అవుతుంది. అందుకే దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని అమ్ముతారు.

భారతదేశంలో బంగారం డిమాండ్ పెరిగింది
దేశంలో పండుగలు, వివాహాల సీజన్‌లో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంది. గతేడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో బంగారం దిగుమతులు 252 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 6.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. ఈ ఏడాది 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. సెప్టెంబర్‌లోనే 5.11 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయింది.

Read More:

ఇండియన్ రైల్వేస్‌లో రియల్ హీరోస్.. మూడేళ్లలో 120మందిని కాపాడారు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత

ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా! 

దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా కేసులు