Indian Railways: ఇండియన్ రైల్వేస్‌లో రియల్ హీరోస్.. మూడేళ్లలో 120మందిని కాపాడారు

రైల్వే స్టేషన్లలో ప్రమాదవశాత్తు రైలు కిందపడే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Indian Railways: ఇండియన్ రైల్వేస్‌లో రియల్ హీరోస్.. మూడేళ్లలో 120మందిని కాపాడారు

Railways

Indian Railways: రైల్వే స్టేషన్లలో ప్రమాదవశాత్తు రైలు కిందపడే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అయితే, గడిచిన మూడేళ్లలో ఈ ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. అందుకు కారణం రైల్వే పోలీసులు అని ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే.

గత మూడేళ్లలో 120 మంది ప్రయాణికులకు రైల్వే పోలీసు సిబ్బంది దేవుళ్లుగా మారారు. రైల్వే పోలీస్ ఫోర్స్(RPF) 111 మరియు ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) సిబ్బంది తొమ్మిది మందిని ప్రమాదాల నుంచి మూడేళ్లలో రక్షించారు. ధైర్యంగా ప్రయాణికులను ప్రమాదం నుంచి కాపాడడంలో తొమ్మిది మంది పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

రన్నింగ్ రైళ్లను పట్టుకునే ప్రయత్నంలో ప్రజలు పడిపోయినప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గత మూడేళ్లుగా ఇలాంటి ఘటనలు నమోదైన సందర్భాలలో, రైల్వే పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పట్టించుకోకుండా ప్రయాణికులను రక్షించారు. ఇలాంటి ఘటనలు సీసీటీవీలో కూడా రికార్డయ్యాయి. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం కూడా.

నలుగురి ప్రాణాలను కాపాడిన RPF మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ కవితా సాహు మాట్లాడుతూ.. కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో విధి నిర్వహణలో, నేను 2020లో ముగ్గురు ప్రాణాలను రక్షించాను. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఒక వ్యక్తిని కాపాడాను. చాలా సందర్భాలలో, ప్రజలు కదిలే వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి పడిపోతుంటారు. అందుకే రైళ్లలో ప్రయాణించేవారు స్టేషన్‌కు 20నిమిషాల ముందు చేరుకుంటే ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు.

Read More:

ఈ మూడు కాంపాక్ట్ SUVలు సెప్టెంబరులో అత్యధికంగా అమ్ముడయ్యాయి

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత

ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా! 

దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా కేసులు