Petrol Price: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఓవైపు అంచనాలు వినిపిస్తున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపించట్లేదు.

Petrol Price: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

Petrol Price

Petrol Price: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఓవైపు అంచనాలు వినిపిస్తున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపించట్లేదు. రోజురోజుకు పెరగుతూ సామాన్యులకు భారంగా మారతుంది పెట్రోల్. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసింది.

ఈ క్రమంలోనే వరుసగా ఐదోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు నాలుగురోజుల పాటు పెరిగిన పెట్రోల్ ధరలు.. రెండు రోజుల విరామం తరువాత మళ్ళీ వరుసగా ఐదురోజులు పాటు పెరిగాయి.

అక్టోబర్ నెలలో ఇప్పటివరకు 20 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. లేటెస్ట్‌గా పెంపుతో లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరుకుంది. అదేవిధంగా లీటరు డీజిల్‌ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.111.91కు, డీజిల్‌ రూ.105.08కు చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.25కి చేరగా డీజిల్ ధర రూ.106.79కి చేరుకుంది.

అక్టోబర్ నెలలో ఇప్పటివరకు 20 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అక్టోబర్ నెలలో 7 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు పెట్రోల్ పై రూ.19 రూపాయలు పెరిగితే, ఇదే సమయంలో డీజిల్‌పై రూ.16వరకు పెరిగింది.

Read More:

ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!

నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత