Compact SUV: ఈ మూడు కాంపాక్ట్ SUVలు సెప్టెంబరులో అత్యధికంగా అమ్ముడయ్యాయి

కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కార్లు తీసుకోవాలని ప్రతీఒక్కరికి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువగా ఈ రేంజ్ కార్లను కొంటున్నారు.

Compact SUV: ఈ మూడు కాంపాక్ట్ SUVలు సెప్టెంబరులో అత్యధికంగా అమ్ముడయ్యాయి

Nexon

Compact SUV: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కార్లు తీసుకోవాలని ప్రతీఒక్కరికి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువగా ఈ రేంజ్ కార్లను కొంటున్నారు. సెప్టెంబర్ నెలలో కాంపాక్ట్ SUVలే ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వాహనాల మార్కెట్ చెబుతుంది.

సెప్టెంబర్‌లో ఫస్ట్ టైమ్ SUV సెగ్మెంట్ అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే, గతేడాది సెప్టెంబర్ నెలలో అమ్మకాల కంటే కాంపాక్ట్ SUV అమ్మకాలు ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్-21 నెలలో, కాంపాక్ట్ SUV విభాగంలో 33,301 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది సెప్టెంబర్-20లో 41,277 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల్లో 19 శాతం తక్కువగా ఉంది.

టాటా నెక్సాన్(Tata Nexon): -9,211 units
టాటా నెక్సాన్ సబ్-ఫోర్ మీటర్ SUV సెగ్మెంట్ సెప్టెంబర్ నెలలో 9,211 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది సెప్టెంబర్‌లో 6,007 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా చూస్తే అమ్మకాలు 53 శాతం పెరిగాయి.

హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue): -7,924 units
హ్యూందాయ్‌ వెన్యూ సుమారు 23.4 kmpl మైలేజీను అందిస్తోంది.
సెప్టెంబర్-21లో హ్యుందాయ్ వెన్యూ 7,924 యూనిట్లు అమ్ముడయ్యాయి.
అయితే, హ్యుందాయ్ సెప్టెంబర్ 2020లో భారతదేశంలో 8,469 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది అమ్మకాలు తగ్గాయి.

కియా సొనెట్(Kia Sonet): -4,454 units
సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేయబడిన మోడల్‌ కియా సోనెట్‌. ARAI సర్టిఫికేట్ ప్రకారం… సోనేట్‌ డీజిల్ వేరియంట్‌ 24 kmpl మైలేజీను, పెట్రోల్ వేరియంట్‌ 18 kmpl ను అందిస్తోంది.
సెప్టెంబర్ 2020లో కంపెనీ 9,266 యూనిట్లను విక్రయించింది.
ఈ ఏడాది సెప్టెంబర్-2021 నెలలో మాత్రం కేవలం 4,454 యూనిట్లు అమ్ముడయ్యాయి.
అమ్మకాలు తగ్గడానికి కారణం సెమీకండక్టర్ల కొరత అని అంటున్నారు.

సెప్టెంబర్ నెలలో మహింద్రా XUV300 వాహనం 3,693యూనిట్లు అమ్ముడుపోగా.. Ford EcoSport 3,558యానిట్స్ అమ్ముడుపోయాయి.

Read More:

ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగిందో తెలుసా?

ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత