వీరసావర్కర్ పై వివాదాస్పద పుస్తకం రిలీజ్ చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఆర్ ఎస్సెస్ కు చెందిన వీరసావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక బుక్ లెట్ ప్రచురించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న 10 రోజుల సేవాదళ్ శిక్షణా కార్యక్రమంలో “హౌ బ్రేవ్ ఈజ్ వీర్ సావర్కర్ ” అనే పేరుతో ప్రచురించిన బుక్ లెట్ ను పంచారు. హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు, గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే, వీరసావర్కర్ మధ్య స్వలింగసంపర్క సంబంధం ఉందని ఆ బుక్ లెట్ లో ప్రచురించారు.
గాడ్సే బ్రహ్మచర్యం తీసుకునే ముందు ఆయన తన రాజకీయ గురువు వీర సావర్కర్ తో శారీరక సంబంధాలు కలిగి ఉన్నారని ఆ పుస్తకం లో పేర్కోన్నారు. ఇందుకు ఆధారం డొమినిక్ లపైరె, లారీ కొల్లిన్స్ రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్’ పుస్తకాన్ని అందులో ఉదహరించారు.
కాంగ్రెస్, బీజేపీ లు అనేకవిషయాల్లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కానీ వివాదాస్పదవిషయాలతో పుస్తకాలు ప్రచురిస్తూ ఇప్పుడు కొత్త యుధ్దానికి తెరతీస్తున్నారు. ఇలాంటి పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో మార్కెట్ లో అమ్ముడు పోవచ్చు ఏమో కానీ.. దీని వల్ల స్వాతంత్య్ర కోసం పోరాడిన వారిపట్ల కొంత చలుకన భావం ఏర్పడే అవకాశం ఉంది.
మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలపై బీజేపీ వారు గతంలో ఇలాంటి పుస్తకాలు ప్రచురించారు. నెహ్రూ స్త్రీ లోలుడని.. నెహ్రూతో సంబంధం ఉన్న మహిళల్లో భారత చివరి వైస్రాయ్ లూయిస్ మౌంట్ బాటెన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ కూడా ఉన్నారంటూ పుస్తకాలు వెలువడ్డాయి. ఈ విమర్శలనుంచి మహాత్మా గాంధీ కూడా తప్పించుకోలేదు. ముసిముసి నవ్వుతున్న మహిళతో మాహత్మా గాంధీ డ్యాన్స్ చేసిన ఒక మార్ఫింగ్ వీడియో కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
వీర సావర్కర్ పై ప్రచురించిన ఈ పుస్తకంలో మరోక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మైనార్టీ మహిళలను అత్యాచారం చేయమని వీరసావర్కర్ హిందువులనుప్రోత్సహించారా అనే ప్రశ్న తలెత్తితోంది. అండమాన్ సెల్యులర్ జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిష్ వారి నుంచి సావర్కర్‌కు డబ్బులు అందుకున్నారని….మసీదుపై సావర్కర్ రాళ్లు రువ్వారని కూడా ఆ పుస్తకంలో ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై బీజేపీ క్షమాపణలు చెప్పమని గట్టిగా డిమాండ్ చేసింది. అనంతరం ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ బచావ్ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… నేను రాహుల్ సావర్కర్ ని కాదు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఇప్పుడు” వీరసావర్కర్ ఎంతటి వీరుడంటే” పుస్తకం ప్రచురించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : జమ్మూలో త్వరలో శ్రీవారి ఆలయం : టీటీడీ ఈవో అనిల్