Venkat Reddy Meeting With Priyanka Gandhi : ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..మునుగోడు ఉపఎన్నికతోపాటు పలు అంశాలపై చర్చ
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జన్ పథ్ లో సమావేశం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Venkat Reddy meeting with Priyanka Gandhi
Venkat Reddy Meeting With Priyanka Gandhi : కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జన్ పథ్ లో సమావేశం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే పిసిసి వైఖరిపై సోనియాగాంధీకి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని కోమటిరెడ్డికి ప్రియాంక గాంధీ సూచించనుంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనబోనని సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో తెలిపారు. మునుగోడులో పార్టీ అంతర్గతంగా జరిపిన సర్వేలో వెంకట్ రెడ్డి ఓటు బ్యాంకు బలంగా ఉందన్నారు.
Congress: కాంగ్రెస్కు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై.. వరుస రాజీనామాలో కుదేలవుతోన్న పార్టీ
మునుగోడు ఉపఎన్నికకు దాన్ని ఉపయోగించుకోవాలని అధిష్టానానికి పిసిసి నేతలు తెలిపారు. తన పట్ల, తన కుటుంబం పట్ల పిసిసి చేసిన వ్యాఖ్యలు,పార్టీలో తనకు చెప్పకుండా చెరకు సుధాకర్ ను చేర్చుకోవడం, మునుగొడులో సభలు సమావేశాలు పెట్టడంపై వెంకట్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.