సినిమా థియేటర్లు ఓపెన్ తర్వాత సీటింగ్ ఇలాగే ఉండొచ్చు..

లాక్‌డౌన్ దెబ్బకి మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరుచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఒక్కటే సమస్య. ఇంతకీ భౌతిక దూరాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? PVRలాంటి సంస్థలు సీటువదలి సీటు చొప్పున కూర్చోబెట్టాలని అనుకొంటున్నాయి
జర్మనీలోని ఓ థియేటర్ ప్లాన్ రెడీచేసింది. సీటువదిలినంతమాత్రానా సోషల్ డిస్టెన్సింగ్ పాటించినట్లుకాదు. అందుకే ఏకంగా సీటింగ్‌నే రీ డిజైన్ చేసింది. ప్రేక్షకులు వచ్చేసరికి am Schiffbauerdammను సిద్ధం చేస్తోంది. బెర్లిన్‌లోని ఈ థియేటర్ కెపాసిటీ 700. సీటువదిలి మరోసీటుకు అనుమతిస్తే 350మంది హాజరుకావచ్చు. అలాగైతే సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేం. అందుకే సీటింగ్ ఎర్పాటునే మార్చేసింది. 200 మందికే సర్దుబాటుచేసింది.
ఇలా మీటర్‌కు సీటుచొప్పున ఎర్పాటుచేశారు. సగం… సింగిల్ సీట్లు, మరో సగం… డబుల్ సీట్లు. సెప్టెంబర్ నుంచి థియేటర్లు ఓపెన్ అయితే ఈ సీటింగ్ ఎర్పాటుతో మాత్రమే కరోనాను అడ్డుకోగలమని, సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించగలమని థియేటర్ యాజమాన్యం అంటోంది. ఇది‘new reality’దానికోసం థియేటర్‌కే మార్పులు చేశారు. ఈ ఎర్పాటంతా ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఉన్నాయికాబట్టి, ఒకసారి అనుమతి వస్తే….థియేటర్‌లో ఎలాంటి భయాలు లేకుండా సినిమాలు, ప్రదర్శనలు చూడొచ్చు. అలాగని పాత టిక్కెట్ రేట్లంటే….నష్టాలు రావచ్చు. అందుకే కొంతమేర రేటుపెరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట.
అలాగని ఆడియన్స్ మాత్రం ఎర్పాట్లపట్ట పెద్దగా సంతృగా లేరు. ప్రేక్షకుల పలచగా కనిపిస్తే థ్రిల్ పోతుందనన్నవాళ్లూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఉత్సాహాన్ని చూపంచడంలేదు. ముందు షూటింగ్స్. ఆ తర్వాత…కరోనా కంట్రోల్‌లోకి వచ్చిందని జనం నమ్మిన తర్వాతనే థియేటర్లను ప్రారంభించొచ్చని భావిస్తోంది.