Washing Clothes: బట్టలు ఉతుక్కోలేదని మరిగే నీళ్లు మీద పోసేసింది
బట్టలు సరిగా ఉతకలేదని చిన్నారి అనే కనికరం లేకుండా హింసకు పాల్పడింది 30ఏళ్ల మహిళ. వరుసకు మేనకోడలు అయిన చిన్నారిపై మరిగే నీళ్లు పోసేసింది. పొరుగింట్లో ఉండేవాళ్ల చిన్నారి ఒంటిపై ....

Women On Child
Washing Clothes: బట్టలు సరిగా ఉతకలేదని చిన్నారి అనే కనికరం లేకుండా హింసకు పాల్పడింది 30ఏళ్ల మహిళ. వరుసకు మేనకోడలు అయిన చిన్నారిపై మరిగే నీళ్లు పోసేసింది. పొరుగింట్లో ఉండేవాళ్ల చిన్నారి ఒంటిపై గాయాలు చూసి ప్రశ్నించేంత వరకూ నిజాలు బయటకు రాలేదు.
పోలీసులకు సమాచారం అందించడంతో బాలికను పిలిచి విచారించారు. ఆమెకు తన అత్త అంటే భయం అంటూ మరోసారి అక్కడకు వెళ్లనని అంతా చెప్పేసింది. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు పంపించారు. బట్టలు ఉతకడం రాలేదని మరిగే నీళ్లను మెడ మీద, కుడి భుజం, చెవి, కాలి మీద పడేలా పోసింది.
సఫియా షేక్ అనే వ్యక్తిని జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, సెక్షన్ 326 ప్రకారం కేసు బుక్ చేశారు. బాలిక తల్లి మానసిక రోగి అందుకే అత్త ఇంటికి పంపించారు. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న చిన్నారిని బాలిక అన్న దగ్గరకు పంపనున్నారు.