Transgenders Cafe : ఆ కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్సే

వెర్సోవాలోని బాంబాయ్ నజారియా కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లనే నియమించుకున్నాడు దాని యజమాని. దీంతో ఈ కేఫ్ ఫేమస్ అయ్యింది.

Transgenders Cafe : ఆ కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్సే

Transgender Cafe Mumbai

Updated On : March 13, 2022 / 8:48 PM IST

Transgenders Cafe :  ట్రాన్స్ జెండర్స్ అంటే ప్రజలకు ఒకరకమైన చిన్న చూపు ఉంది. కానీ ఆకేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లే పని చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లపై ఉన్న వ్యతిరేకత పోగొట్టే ఉద్దేశ్యంతో కేఫ్ యజమాని అందర్ని వారినే రిక్రూట్  చేసుకున్నాడు.

ముందు నువ్వు మారు….ఆతర్వాత ఈ ప్రపంచమే మారుతుంది అనే నినాదంతో ముంబైలోని  ఈ కేఫ్ ఇందుకు ముందుకు వచ్చింది. వెర్సోవాలోని బాంబాయ్ నజారియా కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లనే నియమించుకున్నాడు దాని యజమాని. దీంతో ఈ కేఫ్ ఫేమస్ అయ్యింది. ట్రాన్స్ జెండర్స్ కు ఉపాధి చూపించిన దాని  యజమానిని అందరూ అభినందిస్తున్నారు.
Also Read : Nadendla Manohar : జనసేన సభకు ఆటంకాలు కలిగించొద్దు- అధికారులకు నాదెండ్ల విజ్ఞప్తి